నాడు ఇందిరా గాంధీ చేసిన రాజ్యాంగ సవరణకు బీజేపీ మోకాలడ్డు ? యూపీలో రేపు కాంగ్రెస్ సంవిధాన్ చర్చా దివస్ గా పాటింపు

| Edited By: Anil kumar poka

Jan 02, 2021 | 4:20 PM

దివంగత ప్రధాని  ఇందిరా గాంధీ రాజ్యాంగ పీఠికకు 'సోషలిస్ట్, సెక్యులర్ అన్న పదాలను చేర్చడం ద్వారా చేసిన సవరణ వివాదాస్పదమవుతోంది.

నాడు ఇందిరా గాంధీ చేసిన రాజ్యాంగ సవరణకు బీజేపీ మోకాలడ్డు ? యూపీలో  రేపు  కాంగ్రెస్ సంవిధాన్ చర్చా దివస్ గా పాటింపు
Follow us on

దివంగత ప్రధాని  ఇందిరా గాంధీ రాజ్యాంగ పీఠికకు ‘సోషలిస్ట్, సెక్యులర్ అన్న పదాలను చేర్చడం ద్వారా చేసిన సవరణ వివాదాస్పదమవుతోంది. రాజ్యాంగ పీఠికలో సావరిన్ డిమోక్రటిక్ రిపబ్లిక్ గా ఉంటూ వచ్చిన డిస్ క్రిప్షన్ ను మారుస్తూ..ఆమె…. ఇదే చోట, సోషలిస్ట్ . సెక్యులర్ అన్న పదాలను చేర్చారు. 1976 లో నవంబరు 11 న పార్లమెంట్42 వ సవరణగా దీన్ని ఆమోదించగా 1977 జనవరి 3 నుంచి దీన్ని  పాటించడం ప్రారంభమైంది. 43 ఏళ్ళ అనంతరం కాంగ్రెస్ పార్టీ ఈ సవరణను పురస్కరించుకుని  యూపీలో ఆదివారం రోజును సంవిధాన్ చర్చా దివస్ గా పాటించనుంది. వివిధ వేదికలపై సెమినార్లు, లెక్చర్లు, డిబేట్లను నిర్వహించనుంది. కానీ ఈ సవరణను బీజేపీ ప్రభుత్వం మళ్ళీ మార్చవచ్చునని ఈ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. గత ఆరేళ్లుగా రాజ్యాంగం ప్రమాదంలో పడిందని యూపీలోని కాంగ్రెస్ మైనారిటీ విభాగం నేతలు పేర్కొంటున్నారు. ఈ రెండు పదాలను తొలగించడం ద్వారా ఈ దేశాన్ని హిందూ రాష్ట్రగా మార్చాలని చూస్తోందని వీరు విమర్శిస్తున్నారు. బీజేపీకి చెందిన రాజ్యసభ ఎంపీ రాకేష్ సిన్హా గతంలోనే పార్లమెంటులో ఓ తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ సోషలిస్ట్ అన్న పదాన్ని తొలగించాలని కోరారు. 2015 లో కూడా మోదీ ప్రభుత్వం రిపబ్లిక్ దినోత్సవం నాడు ఓ యాడ్ విషయంలో వివాదాన్ని రేపింది. ఆ యాడ్ లో సెక్యులర్, సోషలిస్టు పదాలను తొలగించింది.

అంటే కాంగ్రెస్ ప్రతిపాదించిన సవరణలను కూడా మేము ఆమోదించబోమన్న రీతిలో ఈ పార్టీ వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.