రాహుల్ రాజీనామా తిరస్కరణ… సీడబ్ల్యూసీ ఏకగ్రీవ నిర్ణయం

| Edited By:

May 25, 2019 | 7:36 PM

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇవాళ సమావేశం అయ్యింది. సార్వత్రిక ఎన్నికల్లో దారుణ ఓటమిపై సుమారు నాలుగు గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల ఫలితాలపై కమిటీ విశ్లేషించింది. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ […]

రాహుల్ రాజీనామా తిరస్కరణ... సీడబ్ల్యూసీ ఏకగ్రీవ నిర్ణయం
Follow us on

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇవాళ సమావేశం అయ్యింది. సార్వత్రిక ఎన్నికల్లో దారుణ ఓటమిపై సుమారు నాలుగు గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల ఫలితాలపై కమిటీ విశ్లేషించింది. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ రాజీనామా చేస్తానని తెలిపారు. దీంతో రాహుల్ నిర్ణయం పట్ల సమావేశంలో సీనియర్‌ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ కూడా రాహుల్‌ రాజీనామాను తిరస్కరించారు. అంతేకాదు రాజీనామా ప్రతిపాదనను సీడబ్ల్యూసీ స‌భ్యులు ఏక‌గ్రీవంగా తిర‌స్క‌రించార‌ని కాంగ్రెస్‌ నేతలు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. పార్టీ పునర్నిర్మాణ బాధ్యతలను రాహుల్‌కే అప్పగించామని..అతని నాయకత్వంలోనే పార్టీ ముందుకెళ్తుందని పార్టీ నాయకులు వివరించారు.