తాత్కాలిక అధ్యక్షుడి వైపే కాంగ్రెస్ మొగ్గు?

| Edited By: Pardhasaradhi Peri

Jul 12, 2019 | 10:05 PM

వచ్చే వారం సీడబ్ల్యూసీ సమావేశమై, తాత్కాలిక అధ్యక్షుడిని నియమించే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటివరకు తేదీలు ఖరారు కాలేదు. మరోవైపు తాత్కాలిక అధ్యక్షుడు కాదని, పూర్తికాలపు అధ్యక్షుడినే నియమిస్తారన్న వార్తలు వచ్చినప్పటికీ, కాంగ్రెస్ అందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ‘తాత్కాలికం’ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత, రాహుల్ టీంలో సభ్యుడైన జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. కాంగ్రెస్ అత్యంత గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోందని, తొందర్లోనే అధ్యక్షుడిని నియమించాలని డిమాండ్ చేసిన […]

తాత్కాలిక అధ్యక్షుడి వైపే కాంగ్రెస్ మొగ్గు?
Follow us on

వచ్చే వారం సీడబ్ల్యూసీ సమావేశమై, తాత్కాలిక అధ్యక్షుడిని నియమించే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటివరకు తేదీలు ఖరారు కాలేదు. మరోవైపు తాత్కాలిక అధ్యక్షుడు కాదని, పూర్తికాలపు అధ్యక్షుడినే నియమిస్తారన్న వార్తలు వచ్చినప్పటికీ, కాంగ్రెస్ అందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ‘తాత్కాలికం’ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత, రాహుల్ టీంలో సభ్యుడైన జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. కాంగ్రెస్ అత్యంత గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోందని, తొందర్లోనే అధ్యక్షుడిని నియమించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.