ఆ సమావేశంలో అలాంటి పదాలు వాడతారా ? నిప్పులు కక్కిన సిబల్

గత సోమవారం  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగిన తీరుపట్ల ఈ పార్టీనేత కపిల్ సిబల్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ మీటింగ్ లో నాయకత్వాన్ని ప్రశ్నించిన వారిని..

ఆ సమావేశంలో అలాంటి పదాలు వాడతారా ? నిప్పులు కక్కిన సిబల్

Edited By:

Updated on: Aug 29, 2020 | 4:32 PM

గత సోమవారం  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగిన తీరుపట్ల ఈ పార్టీనేత కపిల్ సిబల్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ మీటింగ్ లో నాయకత్వాన్ని ప్రశ్నించిన వారిని , దేశ ద్రోహులని, ఇంకా యేవో అనుచిత పదాలు వాడారని ఆయన అన్నారు. ఈ లేఖ రాసినవారు తమ వాదనను సమర్థించుకున్నారని, దానికి కట్టుబడి ఉన్నారని ఆయన చెప్పారు. అసలు ఆ లేఖను ప్రజలు చదివి ఉంటే అపోహలు తలెత్తేవి ఉండేవి కావన్నారు. గాంధీ కుటుంబాన్ని కించపరచాలన్నది ఎవరి ఉద్దేశమూ కాదని సిబల్ పేర్కొన్నారు. ఏమైనా పార్టీకి పునరుజ్జీవం అన్నది అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

బీజేపీని గట్టిగా ఎదుర్కోవాలంటే ఇప్పటినుంచే అందుకు సన్నద్ధం కావాలని కపిల్ సిబల్ అన్నారు. త్వరలో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు, మరి కొన్ని రాష్టాల్లో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్న తరుణంలో పార్టీ సమిష్టిగా విజయం కోసం కృషి చేయాల్సి ఉందన్నారు.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us