జాతీయ అవార్డుల ఎంపికకు కమిటీ నియామకం

|

Aug 04, 2020 | 4:57 AM

ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు ప్రత్యేక కమిటీని నియమించింది ప్రభుత్వం. జాతీయ అవార్డు-2020 కోసం ఉపాధ్యాయుల ఎంపిక నిమిత్తం రాష్ట్ర స్థాయి కమిటీని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

జాతీయ అవార్డుల ఎంపికకు కమిటీ నియామకం
Follow us on

ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు ప్రత్యేక కమిటీని నియమించింది ప్రభుత్వం. జాతీయ అవార్డు-2020 కోసం ఉపాధ్యాయుల ఎంపిక నిమిత్తం రాష్ట్ర స్థాయి కమిటీని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిటీలో పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి చైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. ఇక, కేంద్ర ప్రభుత్వ నామినీ డాక్టర్‌ గీతా ప్రసన్నన్‌ సభ్యులుగా , పాఠశాల విద్యా కమిషనర్‌ మెంబర్‌ సెక్రెటరీగా, ఎస్‌సీఇఆర్‌టీ డైరెక్టర్‌ మరో సభ్యులుగా ఉంటారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులను కమిటీ ఎంపిక చేస్తుంది. ఇందుకు సంబంధించిన తుది జాబితాను కమిటీ సిద్ధం చేసి కేంద్రానికి నివేదించనుంది.