కరోనావైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత ప్రపంచం ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో, భారత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను కదిలించడానికి పౌరుడిని ఆకర్షించే దిశగా ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలో అక్టోబర్ నెల నుంచి వంట గ్యాస్, సీఎన్జీ ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. సహజ వాయువు ధరలు అక్టోబర్ 1 నుంచి తగ్గడమే దీనికి కారణమని బులియన్ నిపుణులు చెబతున్నారు. అక్టోబర్ నెలలో సహజ వాయువు ధర మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ల ధర 1.9 నుంచి 1.94 డాలర్లకు తగ్గవచ్చు. ఇదే జరిగితే మన దేశంలో సహజ వాయువు ధరలు దశాబ్దకాల కనిష్టానికి చేరుకోంటాయి. అయితే, ఇది ఒఎన్‌జిసి వంటి గ్యాస్ ఉత్పత్తి చేసే సంస్థల ఆదాయాన్ని ప్రభావితం చేస్తుంది.
దేశంలో సహజ వాయువు ధర రెండుసార్లు మారుతుంది. ఈ మార్పు ఏప్రిల్ 1, అక్టోబర్ 1 న అమల్లోకి వస్తుంది. ఈసారి కూడా గ్యాస్ ధరలను తగ్గించినట్లయితే, సహజ వాయువు ధరలను తగ్గించడం ఇది వరుసగా మూడవసారి. ఈ ఏడాది ఏప్రిల్‌లో సహజవాయువు ధరను 26 శాతం తగ్గించారు.ఈ కోత నేపథ్యంలో సహజ వాయువు ధర 2.39 డాలర్లకు పడిపోయింది. సహజ వాయువును ఎరువులు, విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. సహజ వాయువు ధరల తగ్గింపు దేశంలో అతిపెద్ద గ్యాస్ ఉత్పత్తిదారు అయిన ఒఎన్‌జిసికి నష్టాలు పెంచుతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read :