ఏపీ రాజధానిపై క్లారిటీ.. ఇవాళ ఏం తేలుస్తారో..?

గత కొద్ది రోజులుగా ఏపీ రాజధాని ఎక్కడ అనే చర్చ జరుగుతోంది. నేతలు ఎవరికి తోచిన అభిప్రాయాన్ని వారు చెబుతున్నారు. మరోవైపు విపక్షాలు రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా నిన్న బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏపీ రాజధాని పై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఒక వేళ రాజధానిని తరలిస్తే అమరావతికి భూములిచ్చిన రైతులకు ఎలాంటి న్యాయం చేస్తారో చెప్పాలని ఆయన కోరారు. అయితే దీనిపై సీఎం జగన్ ఈ రోజు […]

ఏపీ రాజధానిపై క్లారిటీ.. ఇవాళ ఏం తేలుస్తారో..?

Edited By:

Updated on: Aug 29, 2019 | 12:26 PM

గత కొద్ది రోజులుగా ఏపీ రాజధాని ఎక్కడ అనే చర్చ జరుగుతోంది. నేతలు ఎవరికి తోచిన అభిప్రాయాన్ని వారు చెబుతున్నారు. మరోవైపు విపక్షాలు రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా నిన్న బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏపీ రాజధాని పై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఒక వేళ రాజధానిని తరలిస్తే అమరావతికి భూములిచ్చిన రైతులకు ఎలాంటి న్యాయం చేస్తారో చెప్పాలని ఆయన కోరారు. అయితే దీనిపై సీఎం జగన్ ఈ రోజు సాయంత్రం క్లారిటీ ఇవ్వనున్నారు. రాజధాని నిర్మాణం పై సీఆర్డీఏ అధికారులతో సమీక్షించనున్నారు. అధికారులతో చర్చించిన అనంతరం రాజధానిపై సీఎం స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us