పీవీ శతజయంతి ఉత్సవాలపై 28న కేసీఆర్‌ సమీక్ష

| Edited By: Pardhasaradhi Peri

Aug 26, 2020 | 10:10 PM

పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాల నిర్వహణ పై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఈనెల 28న ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2గంటలకు జరిగే...

పీవీ శతజయంతి ఉత్సవాలపై 28న కేసీఆర్‌ సమీక్ష
Follow us on

పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాల నిర్వహణ పై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఈనెల 28న ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2గంటలకు జరిగే ఈసమావేశంలో పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఇప్పటి వరకూ జరిగిన కార్యక్రమాలను సమీక్షించడంతో పాటు రాబోయే రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలపై చర్చ జరగనుంది.

అయితే మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతి ఉత్పవాలను ఏడాది పాటు ఘనంగా
నిర్వహించాలని  ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించిన సంగతి తెలిపిందే. పీవీ పుట్టినరోజైన జూన్ 28 నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆయన శత జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం ఎంపీ కె.కేశవరావు నేతృత్వంలో కమిటీని ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కేకే ఆధ్వర్యంలోని కమిటీలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ పీవీ కుమారుడు ప్రభాకర్రావు, కుమార్తె వాణీదేవి, మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, అదికార బాషాసంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు, కేంద్ర సాహిత్య ఆకాడమీ అవార్డు గ్రహీత అంపశాయ్య నవీన్లు సభ్యులుగా ఉన్నారు.