నేడు సీఎం కేసీఆర్ తమిళనాడులోని కాంచీపురానికి వెళ్లనున్నారు. 40 సంవత్సరాలకు ఒకసారి 40 రోజులపాటు దర్శనభాగ్యం కలిగించే అత్తి వరదరాజ పెరుమాళ్‌ను సందర్శించుకోనున్నారు. ఆ తర్వాత శివకంచి వెళ్తారని సమాచారం. ఉదయం 10 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి కంచికి రోడ్డుమార్గంలో వెళ్తారు. అక్కడి నుంచి తిరుమలకు చేరుకుంటారు. ఆ తర్వాత రేణిగుంట నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తిరిగి వస్తారు.