#COVID2019 అక్వా రంగానికి ఊరట… జగన్ హామీ

|

Mar 27, 2020 | 4:10 PM

ఒకవైపు కరోనా ప్రభావం.. ఇంకో వైపు లాక్ డౌన్.. వెరసి పౌల్ట్రీ, ఆక్వా రంగాలు అతలాకుతమైపోతున్నాయి. ఈ రెండు రంగాలలో లక్షలాది మంది సామాన్య వ్యాపారులు ఆధారపడి బతుకుతున్న పరిస్థితిలో కరోనా ప్రభావం వారందరి జీవితాలను దెబ్బ కొట్టింది.

#COVID2019 అక్వా రంగానికి ఊరట... జగన్ హామీ
Follow us on

Jagan focusing on aqua industry: ఒకవైపు కరోనా ప్రభావం.. ఇంకో వైపు లాక్ డౌన్.. వెరసి పౌల్ట్రీ, ఆక్వా రంగాలు అతలాకుతమైపోతున్నాయి. ఈ రెండు రంగాలలో లక్షలాది మంది సామాన్య వ్యాపారులు ఆధారపడి బతుకుతున్న పరిస్థితిలో కరోనా ప్రభావం వారందరి జీవితాలను దెబ్బ కొట్టింది. అయితే.. ఈ రెండు రంగాల వ్యాపారులు, వాటిపై ఆధారపడిన రైతులు, మత్స్యకారులను ఆదుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను సంబంధిత వర్గాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆక్వా రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఆక్వా రైతులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి చర్యలు ప్రారంభించారు. మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణతో కలిసి పరిస్థితిని రివ్యూ చేశారు ముఖ్యమంత్రి జగన్. అధికార యంత్రాంగానికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఆక్వా ఆధారిత ఉత్పత్తుల ధరలపై కరోనా ప్రభావం పడకుండా ప్రభుత్వం నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యంగా రైతులు వైరస్ భయం గానీ.. మరే ఇతర ఇబ్బందులు లేకపోతే తొందరపడి తమ పంటను హార్వెస్ట్ చేయవద్దని ముఖ్యమంత్రి సూచించారు. తమ ప్రభుత్వం తరపున తగిన చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి సూచన మేరకు ఆక్వా రంగానికి సంబంధించిన అసోసియేషన్, సంబంధిత అధికారులతో కలిపి శనివారం ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి వాటి సారాంశాన్ని ముఖ్యమంత్రితో చర్చించి … ఆ తర్వాత సీఎం ఆదేశానుసారం సత్వర చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి మోపిదేవి వెంకట రమణ తెలిపారు.