కాల్పుల ఘటనతో బంగ్లాదేశ్-న్యూజిల్యాండ్ మధ్య టెస్టు రద్దు

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:53 PM

క్రైస్ట్‌చర్చ్‌: బంగ్లాదేశ్‌ క్రికెటర్లు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. న్యూజీలాండ్‌ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు శుక్రవారం మధ్యాహ్నం స్థానిక మసీదుకు ప్రేయర్ చేయడానికి వెళ్లారు. అదే సమయంలో గుర్తు తెలియని దుండగుడు మసీదులోకి చొరబడి ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో మృతి చెందిన వాళ్లు పదులు సంఖ్యలో ఉన్నారు.‌ వెంటనే అప్రమత్తమైన బంగ్లా ఆటగాళ్లు పక్కనే ఉన్న పార్క్ ద్వారా తప్పించుకున్నారు. బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ తమిమ్‌ ఇక్బాల్‌ ట్విటర్‌లో ఈ విషయాన్ని చెప్పారు. ‘మా […]

కాల్పుల ఘటనతో బంగ్లాదేశ్-న్యూజిల్యాండ్ మధ్య టెస్టు రద్దు
Follow us on

క్రైస్ట్‌చర్చ్‌: బంగ్లాదేశ్‌ క్రికెటర్లు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. న్యూజీలాండ్‌ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు శుక్రవారం మధ్యాహ్నం స్థానిక మసీదుకు ప్రేయర్ చేయడానికి వెళ్లారు. అదే సమయంలో గుర్తు తెలియని దుండగుడు మసీదులోకి చొరబడి ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో మృతి చెందిన వాళ్లు పదులు సంఖ్యలో ఉన్నారు.‌ వెంటనే అప్రమత్తమైన బంగ్లా ఆటగాళ్లు పక్కనే ఉన్న పార్క్ ద్వారా తప్పించుకున్నారు.

బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ తమిమ్‌ ఇక్బాల్‌ ట్విటర్‌లో ఈ విషయాన్ని చెప్పారు. ‘మా జట్టు సభ్యులందరూ స్థానిక మసీదుకు ప్రార్థనలకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. వెంటనే తేరుకొని అక్కడి నుంచి పరుగులు తీసి ప్రాణాలను కాపాడుకున్నాం. మేమంతా క్షేమంగానే ఉన్నాం. ఈ ప్రమాదం నుంచి జట్టు సభ్యులందరం తప్పించుకున్నాం. ఇదొక భయానక ఘటన. మా గురించి ప్రార్థించండి’ అని తమీమ్‌ పోస్టు చేశారు. నెలరోజుల పర్యటనలో భాగంగా బంగ్లా జట్టు న్యూజీలాండ్‌తో మూడు వన్డేలు ఆడగా ప్రస్తుతం రెండు టెస్టులు ముగిశాయి. శనివారం నుంచి మూడో టెస్టు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇరు దేశాల సమన్యయంతో మూడవ టెస్టును రద్దు చేస్తున్నట్టుగా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. తదుపరి కార్యచరణ త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది