రాజకీయ జీవితంపై స్పందించిన మెగాస్టార్.. మరో జన్మంటూ ఉంటే అలాగే పుట్టాలని ఉందని వ్యాఖ్య.

|

Dec 26, 2020 | 8:54 AM

అక్కినేని సమంత హోస్ట్‌గా ఆహా ఓటీటీలో నిర్వహిస్తోన్న సామ్ జామ్ కార్యక్రమానికి హాజరైన చిరు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వెళ్లి పదేళ్లలో చాలా విషయాలను తెలుసుకున్నానని చెప్పారు..

రాజకీయ జీవితంపై స్పందించిన మెగాస్టార్.. మరో జన్మంటూ ఉంటే అలాగే పుట్టాలని ఉందని వ్యాఖ్య.
Follow us on

chiru about political life: హీరోయిజానికి సరికొత్త అర్థం చెబుతూ.. అసలు హీరో అంటే చిరంజీవిలానే ఉంటాడనే భావన కలిగించిన వ్యక్తి చిరంజీవి. తన అసమాన నటన, డ్యాన్స్‌లతో తెలుగు ప్రేక్షకులను మైమరపించిన చిరు సినిమాల్లో పీక్‌లో ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రజారాజ్యం పేరుతో పార్టీని స్థాపించి పోటీకి దిగారు. అయితే సినిమాల్లో రాణించినంతలా.. రాజకీయాల్లో మాత్రం చిరు విజయాన్ని అందుకోలేకపోయారు. అనంతరం పలు కారణాల నేపథ్యంలో చిరు రాజకీయాలకు దూరమయ్యారు. అనంతరం కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్లీ ఖైదీ నెంబర్ 150తో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారారు.
ఇదిలా ఉంటే తన రాజకీయ జీవితంపై వస్తోన్న వార్తలు, అసలు మళ్లీ సినిమాల్లోకి ఎందుకు వచ్చారన్న దానిపై తాజాగా చిరు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అక్కినేని సమంత హోస్ట్‌గా ఆహా ఓటీటీలో నిర్వహిస్తోన్న సామ్ జామ్ కార్యక్రమానికి హాజరైన చిరు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వెళ్లి పదేళ్లలో చాలా విషయాలను తెలుసుకున్నానని చెప్పారు. రాజకీయాలు తనకు సెట్ కావని అర్థమైందని తేల్చి చెప్పారు. నటుడిగా చాలా సంతోషంగా ఉన్నానని, ఇకపై రాజకీయాల జోలికి పోనని క్లారిటీ ఇచ్చారు. అంతటితో ఆగకుండా మరో జన్మంటూ ఉంటే అప్పుడు కూడా నటుడిగానే పుట్టాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. ఇక చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం గురించి స్పందించిన చిరు.. పవన్ కష్టానికి సరైన ప్రతిఫలం దక్కుంతని, కచ్చితంగా విజయం సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో గత కొన్నిరోజులుగా చిరు జాతీయ పార్టీలో చేరనున్నాడని జరుగుతోన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్లైంది. ఇక చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ ఆచార్య.. మెహర్ రమేష్ వేదాళం రీమేక్.. జయం రాజా లూసీఫర్ రీమేక్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.