Acharya Movie: మెగాస్టార్‌ చిరంజీవి మూవీ ‘ఆచార్య’ విడుదల తేదీ ఫిక్స్‌ చేశారా.? ఆ తేదీ చిరుకు కలిసి వచ్చేనా…?

|

Jan 11, 2021 | 4:05 PM

Acharya Movie: కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న మూవీ 'ఆచార్య'. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు తేదీని ఫిక్స్‌ చేశారా..? అంటే...

Acharya Movie: మెగాస్టార్‌ చిరంజీవి మూవీ ఆచార్య విడుదల తేదీ ఫిక్స్‌ చేశారా.? ఆ తేదీ చిరుకు కలిసి వచ్చేనా...?
Follow us on

Acharya Movie: కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న మూవీ ‘ఆచార్య’. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు తేదీని ఫిక్స్‌ చేశారా..? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌వర్గాలు. ఈ సినిమాను నిరంజన్‌రెడ్డి, రామ్‌ చరణ్ లు నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో రాంచరణ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఆచార్య మూవీని వేసవిలో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

మే 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా మే 9న థియేటర్‌లోకి వచ్చింది. ఈ సినిమా ఎంతో హిట్‌ కొట్టింది. ఈ సినిమా విడుదల తేదీ ఎంతో కలిసి వచ్చినందున చిత్ర బృందం ఆచార్య మూవీ విడుదలకు ఈ తేదీనే ఎంచుకుందని సమాచారం. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది.

Janhvi Kapoors : లేడీ సూపర్ స్టార్‌ నయనతార క్యారెక్టర్ చేయనున్న జాన్వీ కపూర్.. మిడిల్ క్లాస్ అమ్మాయిగా..