సీఎం వైయస్ జగన్‌ను కలవనున్న టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం!

| Edited By:

Mar 11, 2020 | 10:42 PM

ఏపీలో స్థానిక సంస్థల కోలాహలం మొదలైంది. టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. చంద్రబాబుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీని వీడగా.. తాజాగా మరో ఎమ్మెల్యేకూడా

సీఎం వైయస్ జగన్‌ను కలవనున్న టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం!
Follow us on

ఏపీలో స్థానిక సంస్థల కోలాహలం మొదలైంది. టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. చంద్రబాబుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీని వీడగా.. తాజాగా మరో ఎమ్మెల్యేకూడా గుడ్‌బై చెప్పబోతున్నారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. రాజీనామా అనంతరం రేపు లేదా ఎల్లుండి ఆయన సీఎం జగన్‌ను కలుస్తారని సమాచారం. అనంతరం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది.

కాగా.. గత ఎన్నికల్లో ఆమంచికృష్ణమోహన్‌పై పోటీ చేసి కరణం బలరాం చీరాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. చీరాలకు బలరాం నాన్ లోకల్ అయినప్పటికీ కృష్ణమోహన్‌పై ఆయన భారీ మెజార్టీతో గెలిపొందారు. గొట్టిపాటి రవిని టీడీపీలో చేర్చుకున్నపటి నుంచీ.. పార్టీతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా దూరంగా ఉన్నారు కరణం బలరాం. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందే.. ఆయన మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డితో చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే టీడీపీని వీడాలని బలరాం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, వల్లభనేని వంశీ, మద్దాలి గిరి బాటలో టిడిపి ఎమ్మెల్యే కారణం బలరాం పయనించనున్నారు. ఇప్పటికే డొక్కా మాణిక్య వరప్రసాద్, విశాఖపట్టణానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఏ రెహమాన్, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఏపీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇక పులివెందులలో జగన్‌పై పోటీచేసిన సతీష్ రెడ్డి కూడా టీడీపీకి గుడ్ బై చెప్పారు. మార్చి 13న జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇలా కీలక నేతలంతా పార్టీని వీడుతుండడంతో టీడీపీ శ్రేణులు నిరుత్సాహానికి గురవుతున్నాయి.