ఢిల్లీలో చైనీస్, నేపాలీ ‘గూఢచారులు’ అరెస్ట్

| Edited By: Pardhasaradhi Peri

Sep 19, 2020 | 3:54 PM

దేశంలో రక్షణ శాఖకు సంబంధించిన కీలక సమాచారాన్ని చైనా ఇంటెలిజెన్స్ విభాగానికి అందజేసేందుకు యత్నిస్తున్న ఆ దేశ మహిళనొకరిని, ఆమెకు సహకరిస్తున్న ఓ నేపాలీయుడిని పోలీసులు..

ఢిల్లీలో చైనీస్, నేపాలీ గూఢచారులు అరెస్ట్
Follow us on

దేశంలో రక్షణ శాఖకు సంబంధించిన కీలక సమాచారాన్ని చైనా ఇంటెలిజెన్స్ విభాగానికి అందజేసేందుకు యత్నిస్తున్న ఆ దేశ మహిళనొకరిని, ఆమెకు సహకరిస్తున్న ఓ నేపాలీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. వీళ్ళు రాజీవ్ శర్మ అనే ఫ్రీ లాన్స్ జర్నలిస్టుకు భారీగా సొమ్ము ముట్టజెప్పి అతడినుంచి ఈ సమాచారాన్ని సేకరించేవారని పోలీసులు చెప్పారు. తమ డొల్ల కంపెనీల ద్వారా ఈ చైనా మహిళ అతడికి ఎప్పటికప్పుడు పెద్ద మొత్తంలో సొమ్ము ఇచ్ఛేదని, అలా సేకరించిన వివరాలను తమ దేశ ఇంటెలిజెన్స్ విభాగానికి పంపేదని తెలియవచ్చింది. ఈ మహిళ,  , ఈమెకు సహాయకుడిగా ఉన్న నేపాలీయుడి నుంచి  పలు మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్, ఇతర ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు. ఇక రాజీవ్ శర్మను నిన్న అధికారిక రహస్యాల చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు. ఈ ఫ్రీ లాన్స్ ఆయన డిఫెన్స్ కు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఎలా సేకరిస్తూ వచ్చాడన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.