హాంకాంగ్‌‌ స్వేచ్ఛకు డ్రాగన్ సంకెళ్లు !

|

May 28, 2020 | 4:48 PM

ప్రపంచానికి కరోనా మహమ్మారిని అంటగట్టిన చైనా తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంటోంది. విశ్వవ్యాప్తంగా కొవిడ్-19తో అల్లాడుతుంటే మెల్లమెల్లగా తన సామ్రాజాన్ని విస్తరించుకుంటోంది. హాంకాంగ్‌పై ఆధిపత్యానికి వడివడిగా అడుగులు వేస్తోంది . చైనా పాలకులు గురువారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హాంకాంగ్‌‌ వాసుల స్వేచ్ఛకు సంకెళ్లు వేసే జాతీయ భద్రతా చట్టానికి చైనా పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆదేశాలతో జాతీయ భద్రతా చట్టంపై చర్చించేందుకు గురువారం ప్రత్యేకంగా సమావేశమైన నేషనల్‌ పీపుల్స్‌‌ కాంగ్రెస్‌ (NPC) […]

హాంకాంగ్‌‌ స్వేచ్ఛకు డ్రాగన్ సంకెళ్లు !
Follow us on

ప్రపంచానికి కరోనా మహమ్మారిని అంటగట్టిన చైనా తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంటోంది. విశ్వవ్యాప్తంగా కొవిడ్-19తో అల్లాడుతుంటే మెల్లమెల్లగా తన సామ్రాజాన్ని విస్తరించుకుంటోంది. హాంకాంగ్‌పై ఆధిపత్యానికి వడివడిగా అడుగులు వేస్తోంది .
చైనా పాలకులు గురువారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హాంకాంగ్‌‌ వాసుల స్వేచ్ఛకు సంకెళ్లు వేసే జాతీయ భద్రతా చట్టానికి చైనా పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆదేశాలతో జాతీయ భద్రతా చట్టంపై చర్చించేందుకు గురువారం ప్రత్యేకంగా సమావేశమైన నేషనల్‌ పీపుల్స్‌‌ కాంగ్రెస్‌ (NPC) ఈ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు అంతర్జాతీయ మీడియా ప్రచురించింది.
మొత్తం 2800 మంది ఎన్‌పీసీ సభ్యులు నూతన చట్టానికి అనుకూలంగా ఓట్లు వేశారని సమాచారం. తాజా నిర్ణయంతో చైనా ఇంటెలిజెన్స్‌ సంస్థలు హాంకాంగ్‌లో తిష్ట వేసే అవకాశం ఉంది. హాంకాంగ్‌లో ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని అణిచేయడానికి, విదేశీ జోక్యాన్ని నిరోధించడానికి ఈ చట్టం తీసుకొచ్చామంటోంది చైనా ప్రభుత్వం. కాగా చైనా చట్టాలను, జాతీయ గీతాన్ని అవమానిస్తే నేరంగా పరిగణించే బిల్లుకు గత నెలలోనే ముసాయిదాను తయారు చేసింది. మరోవైపు హాంగ్ కాంగ్ పై అంక్షలను ఏమాత్రం సహించేదీ లేదంటూ హెచ్చరిస్తున్నారు అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్.