38 వేల చ.కి. ఆక్రమించిన చైనా.. రాజ్యసభలో రాజ్ నాథ్ సింగ్

లడాఖ్ లో చైనా అక్రమంగా 38 వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించిందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం రాజ్యసభలో తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రకటన చేస్తూ, దీంతో బాటు 1963 లో కుదిరినట్టు చెబుతున్న చైనా-పాకిస్తాన్..

38 వేల చ.కి. ఆక్రమించిన చైనా.. రాజ్యసభలో రాజ్ నాథ్ సింగ్

Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 17, 2020 | 1:21 PM

లడాఖ్ లో చైనా అక్రమంగా 38 వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించిందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం రాజ్యసభలో తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రకటన చేస్తూ, దీంతో బాటు 1963 లో కుదిరినట్టు చెబుతున్న చైనా-పాకిస్తాన్ సరిహద్దు ఒప్పందం కింద పాకిస్తాన్.. తాను ఆక్రమించిన కాశ్మీర్ (పోక్)  లోని 5,180 కి.మీ. భూభాగాన్ని చైనాకు అప్పనంగా అప్పగించిందని ఆయన వెల్లడించారు. గత జూన్ 15 న  బోర్డర్లో కల్నల్ సంతోష్ బాబు, మరో 19 మంది జవాన్లు అమరులయ్యారని, దేశం వారి త్యాగాన్ని మరువదని  ఆయన చెప్పారు. సరిహద్దుల్లో భారత దళాల నైతిక స్థైర్యాన్ని పెంచేందుకు ప్రధాని మోదీ స్వయంగా లడాఖ్  ను సందర్శించారని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి చైనా తన దళాల  సంఖ్యను పెంచిందని, అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ చైనా ఆగడాలను భారత్ అడ్డుకుంటుందని ఆయన అన్నారు. కాగా-ఆయన ఈ ప్రకటన చేస్తున్నప్పుడు విపక్షాలు పదేపదే అడ్డు తగిలాయి. చైనా ఇంతగా బరి తెగిస్తుంటే భారత ప్రభుత్వం  ఏం చేస్తోందని వారు ప్రశ్నించారు.