జో బైడెన్‌కు అభినందనలు చెప్పడానికి ఇష్టపడని చైనా

|

Nov 09, 2020 | 5:33 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ గెలవాలని చైనా బలంగా అనుకుంది.. కాని అది జరగలేదు.. ట్రంప్‌ ఓడిపోయారు.. జో బైడెన్‌ గెలిచారు.. గెలిచినందుకు మర్యాదపూర్వకంగా అభినందించాలి కదా! చైనా ఆ పని కూడా చేయడం లేదు.. జో బైడెన్‌ను అభినందిస్తున్నారా? అన్న ప్రశ్నకు చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ నిర్మోహమాటంగా లేదనేశారు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం అధికారికంగా ఇంకా వెలువడలేదని, అందుకే ఇప్పుడే అభినందనలు తెలుపలేమని అన్నారు.. ట్రంప్‌ కూడా ఇంకా తాను […]

జో బైడెన్‌కు అభినందనలు చెప్పడానికి ఇష్టపడని చైనా
Follow us on

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ గెలవాలని చైనా బలంగా అనుకుంది.. కాని అది జరగలేదు.. ట్రంప్‌ ఓడిపోయారు.. జో బైడెన్‌ గెలిచారు.. గెలిచినందుకు మర్యాదపూర్వకంగా అభినందించాలి కదా! చైనా ఆ పని కూడా చేయడం లేదు.. జో బైడెన్‌ను అభినందిస్తున్నారా? అన్న ప్రశ్నకు చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ నిర్మోహమాటంగా లేదనేశారు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం అధికారికంగా ఇంకా వెలువడలేదని, అందుకే ఇప్పుడే అభినందనలు తెలుపలేమని అన్నారు.. ట్రంప్‌ కూడా ఇంకా తాను గెలిచినట్టేనని అనుకుంటున్నారు.. ఓటమిని అసలు ఒప్పుకోవడం లేదు.. పైగా ఓట్ల లెక్కింపు సరిగ్గా జరలేదంటూ సుప్రీంకోర్టు తలుపు కూడా తట్టారు. ఓ పక్క ప్రపంచదేశాల అధినేతలంతా జో బైడెన్‌కు, వైఎస్‌ ప్రెసిడెంట్‌గా గెలిచిన కమలాహారిస్‌ను అభినందిస్తుంటే చైనా మాత్రం ఇష్టపడటం లేదు.. అప్పుడెప్పుడో రష్యా, మెక్సికోలతో పాటు కొన్ని దేశాలు కొత్త అధ్యక్షులు ఎన్నికైనప్పటికీ తుది నిర్ణయం వెలువడే వరకు అభినందించలేదంటూ ఓ సాకు చెబుతున్నారు వాంగ్‌ వెన్‌బిన్‌.