ప్రజల నిర్ణయమే శిరోధార్యం.. ఓటమిని ఒప్పుకున్న ఝార్ఖండ్ సీఎం!

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం నమోదైన గణాంకాలు బట్టి చూస్తే.. కాంగ్రెస్- జేఎంఎం కూటమి 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ కేవలం 25 స్థానాల్లోనే ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ తన ఓటమిని అంగీకరించారు. ‘ప్రజల నిర్ణయాన్ని బీజేపీ శిరసావహిస్తుందని.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడతామని’ సీఎం రఘుబర్ దాస్ అన్నారు. కాగా, ఇప్పటికే కాంగ్రెస్- ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) కూటమి మేజిక్ […]

ప్రజల నిర్ణయమే శిరోధార్యం.. ఓటమిని ఒప్పుకున్న ఝార్ఖండ్ సీఎం!

Updated on: Dec 23, 2019 | 6:05 PM

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం నమోదైన గణాంకాలు బట్టి చూస్తే.. కాంగ్రెస్- జేఎంఎం కూటమి 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ కేవలం 25 స్థానాల్లోనే ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ తన ఓటమిని అంగీకరించారు. ‘ప్రజల నిర్ణయాన్ని బీజేపీ శిరసావహిస్తుందని.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడతామని’ సీఎం రఘుబర్ దాస్ అన్నారు. కాగా, ఇప్పటికే కాంగ్రెస్- ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) కూటమి మేజిక్ ఫిగర్(41)ను దాటేయడమే కాకుండా భారీ మెజార్టీ దిశగా అడుగులు వేస్తోంది. ఇదిలా ఉంటే జంషేడ్‌పుర్ ఈస్ట్ స్థానం నుంచి రఘుబర్ దాస్ ఓటమికి చేరువలో ఉండగా..  ప్రత్యర్థి అయిన స్వతంత్ర అభ్యర్థి సరయు రాయ్ ఆయనపై భారీ మెజార్టీతో గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఝార్ఖండ్‌లో అధికార పగ్గాలు పట్టిన గిరిజనేతర ముఖ్యమంత్రుల్లో ఒకరైన రఘుబర్ దాస్ ఐదేళ్లూ పదవిలో కొనసాగడం విశేషం. అయితే ఆయన పాలన పార్టీలోనే వ్యతిరేకత తలెత్తింది. పార్టీ కార్యకర్తలను విశ్వాసంలోకి తీసుకోకపోవడం కూడా బహుశా ఆయన ఓటమికి కారణమైనట్లు కనిపిస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us