CSK vs KKR : వీరిలో ఎవరు గెలిచినా…

ఐపీఎల్ -13 సీజన్‌లో జోష్ మరింత పెరిగింది. ప్లేఆఫ్ కోసం పోటీ రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే రెండు జట్లు చేరుకోగా.. తాజాగా చేరుతున్న జట్టుపై చర్చ జరుగుతోంది. ఈ రోజు దుబాయ్ వేదికగా జరుగనున్న మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది.

CSK vs KKR : వీరిలో ఎవరు గెలిచినా...
Follow us

|

Updated on: Oct 29, 2020 | 6:01 PM

ఐపీఎల్ -13 సీజన్‌లో జోష్ మరింత పెరిగింది. ప్లేఆఫ్ కోసం పోటీ రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే రెండు జట్లు చేరుకోగా.. తాజాగా చేరుతున్న జట్టుపై చర్చ జరుగుతోంది. ఈ రోజు దుబాయ్ వేదికగా జరుగనున్న మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఇయాన్‌ మోర్గాన్‌ సారథ్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌, మహేంద్ర సింగ్‌ ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ప్లేఆఫ్‌ బెర్తు అవకాశాలను మరింత మెరుగుపరచుకోవాలని కోల్‌కతా భావిస్తోంది.

మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే 16 పాయింట్లతో కోల్‌కతా ప్లేఆఫ్‌ రేసులో ఉంటుంది. టాప్‌-4లో చోటు దక్కాలంటే నెట్‌రన్‌రేట్‌ కూడా కీలకంగా మారింది. రెండింటిలో ఒక మ్యాచ్‌ గెలిచినా కోల్‌కతా ప్లేఆఫ్‌ చేరే అవకాశం ఉంది. కానీ, మిగతా జట్ల ఫలితాలపై ఈ ప్రభావం పడనుంది.

ఇప్పటికే ప్లేఆఫ్‌ నుంచి నిష్క్రమించిన చెన్నైపై భారీ విజయాన్ని సాధించాలని కోల్‌కతా భావిస్తోంది. గత మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు చెన్నై షాకిచ్చింది. అదే జోరులో కోల్‌కతాపై గెలవాలని ధోనీసేన పట్టుదలతో ఉంది. ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో కోల్‌కతా పాయింట్ల పట్టికలో ఐదోస్థానంలో ఉంది. చెన్నై 4 విజయాలతో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది.

అయితే ఈ రోజు జరిగే మ్యాచ్‌లో దోనీ సేన గెలిస్తే.. సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ప్లేఆఫ్ చేరేందుకు అవకాశాలు మెరుగవుతాయి. ఇప్పటి వరకూ 12 మ్యాచ్‌లాడిన కోల్‌కతా ఆరు మ్యాచుల్లో గెలిచింది. ప్రస్తుతం 12 పాయింట్లతో పంజాబ్‌తో సమానంగా ఉంది. రన్‌రేట్‌ తక్కువగా ఉండటంతో పాయింట్ల పట్టికలో పంజాబ్‌ కంటే దిగువన ఉండిపోయింది. ఇప్పుటి వరకూ కోల్‌కతాను వెనక్కి లాగుతున్న రన్‌రేట్‌ ఆ జట్టు భవిష్యత్‌ను కూడా నిర్ణయించనుంది. ఇందులో రన్ రేట్ బాగున్న జట్లలో హైదరాబాద్ మెరుగ్గా ఉంది. ఆరెంజ్ టీమ్‌ మరో రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచులను తప్పని సరిగా గెలిస్తే.. 14 పాయిట్లతో ముందుంటుంది.  దీంతోపాటు మొదటి నాలుగు జట్లలోకి హైదరాబాద్ చేరిపోతుంది.

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?