తాహీర్‌ను అందుకే ఆడించడం లేదుః సీఎస్‌కే

|

Oct 15, 2020 | 11:02 AM

గతేడాది ఐపీఎల్‌లో అతడు పర్పుల్ క్యాప్ విన్నర్. చెన్నై సూపర్ కింగ్స్ విజయలన్నింటిలోనూ కీలక పాత్రను పోషించాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో మాత్రం అతడికి...

తాహీర్‌ను అందుకే ఆడించడం లేదుః సీఎస్‌కే
Follow us on

గతేడాది ఐపీఎల్‌లో అతడు పర్పుల్ క్యాప్ విన్నర్. చెన్నై సూపర్ కింగ్స్ విజయలన్నింటిలోనూ కీలక పాత్రను పోషించాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో మాత్రం అతడికి ఇంతవరకు తుది జట్టులోకి చోటు దక్కలేదు. కేవలం రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అతనెవరో కాదు స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్. (Chennai Super Kings Not To Trade Imran Tahir)

తాహీర్‌కు ఇంతవరకు తుది జట్టులో అవకాశం ఇవ్వకపోవడంపై తాజాగా సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాధన్ స్పందించారు. ”నాణ్యమైన ఆటగాళ్లను రిజర్వ్ బెంచ్‌లో ఉంచడం చాలా కష్టం. అయితే ఐపీఎల్ నిబంధనలు ప్రకారం జట్టులో కేవలం నలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే ఉండాలి. టాప్ ఆర్డర్‌లో నాణ్యమైన ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ అవసరం. అలాగే ఇద్దరు ఆల్‌రౌండర్లను ఉంచాలన్న ఉద్దేశ్యంతోనే డ్వేన్ బ్రావో, సామ్ కరన్‌ను తీసుకున్నాం. త్వరలోనే తాహీర్‌కు అవకాశమిస్తాం. అటు ద్వితీయార్ధం అద్భుతంగా రాణిస్తాడని నమ్మకం ఉందన్నారు. అలాగే మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్‌లో తమ ఆటగాళ్లను వదులుకోమని సీఎస్‌కే సీఈవో విశ్వనాధన్ పేర్కొన్నారు.

Also Read:

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్.. దసరా స్పెషల్ ట్రైన్స్ లిస్ట్ ఇదే.!

ఆ పాత రూపాయి నాణెంతో.. రూ. 25 లక్షలు మీ సొంతమవుతాయట!

బిగ్ బాస్ 4: ‘టాప్’ లేపుతున్న ఆ ఇద్దరు.. ఫైనల్ ఫైవ్‌లో ఎవరుంటారో.?