Cheating in the name of Marriage: పెళ్ళి పేరుతో ఓ యువతి ఆడిన నాటకంతో ఖంగుతిన్న ఓ అమెరికా అబ్బాయి స్టోరీ ఇది. మ్యాట్రిమోనీలో పేరు మార్చి ఓ యువతి విసిరిన వలలో పడి ఏడున్నర లక్షలు కోల్పోయిన అబ్బాయి కుటుంబం. నెల రోజులుగా అమెరికా అబ్బాయిని మారుపేరుతో మోసం చేసిన యువతి.. చివరికి ఏడున్నర లక్షల రూపాయలకు టోకరా వేసి చెక్కేసింది. ఈ ఉదంతం గుంటూరు జిల్లాలో జరిగింది.
ప్రకాశం జిల్లా ఉలవపాడుకు చెందిన మైనేని సముద్రగా మ్యాట్రిమోనీలో నమోదు చేసుకున్న ఓ యువతి అమెరికా అబ్బాయికి గాలమేసింది. అమెరికాలో వుంటున్న తెనాలి యువకున్ని పెళ్ళి పేరిట నమ్మించింది. తన పేరు మైనేని సముద్రగా పరిచయం చేసుకుని, తన తల్లిదండ్రులు మద్రాస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా చెప్పుకుంది. అక్టోబర్ 21న పెళ్ళి చూపులు.. 24వ తేదీన పసుపు కుంకుమ పెట్టుకుందామని నమ్మించింది. ఈలోగా నగలు, వస్త్రాలు కొనాలంటూ డబ్బు అడిగింది. దాంతో అబ్బాయి కుటుంబం వారు 7.2 లక్షల రూపాయలు యువతి అకౌంట్‌లో వేశారు.
తీరా అక్టోబర్ 21వ రావడంతో బుధవారం పెళ్ళి చూపులకని ఉలవపాడుకు తరలి వెళ్ళారు. ఊరంతా తిరిగినా ఆ యువతి ఇచ్చిన తాలూకు ఎవరూ లేకపోవడం.. ఈలోగా ఆ యువతి తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేయడంతో తాము మోసపోయామని అబ్బాయి కుటుంబం గ్రహించింది. ఇక ఏమీ చేయలేక తమకు జరిగిన మోసం గురించి పోలీసులకు ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Also read: ‘నో ఎంట్రీ జోన్’ నిబంధనలను సడలించిన హైకోర్టు
Also read: స్వప్నా సురేశ్ అరెస్టుకు గ్రీన్ సిగ్నల్
Also read: అభిమానులకు శుభవార్త చెప్పిన సంజయ్‌దత్
Also read: తొక్కిసలాటలో 12 మంది మహిళలు దుర్మరణం