ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భగేల్ గిరిజనులతో కలిసి స్టెప్పులేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాయ్‌పుర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన సంబరాల్లో గిరిజనులతో కలిసి ఆయన పాల్గొన్నారు. డప్పు చప్పుళ్లకు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. ఒక సీఎం హోదాలో ఉండి ఇలా తమతో కలిసి చిందులేసినందుకు గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు.