54 రోజులు.. 3.50 లక్షల కిలోమీటర్లు.. చంద్రయాన్- 2 ప్రయాణం

| Edited By: Anil kumar poka

Jul 14, 2019 | 10:50 AM

భారత అంతరిక్ష ప్రయోగకేంద్రం ఇస్రో ప్రతిష్టాత్మక చంద్రయన్ -2 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 20 గంటలపాటు నిర్విరామంగా సాగుతున్న ఈ ప్రక్రియలో భాగంగా రేపు తెల్లవారుజామున 2.51 గంటలకు 640 టన్నుల బరువుకలిగిన జీఎస్ఎల్వీ మార్క్ 3-ఎం1 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. ఇందులో 3.8 టన్నుల బరువైన చంద్రయాన్ 2- మిషన్‌ను సైంటిస్టులు అమర్చారు. ఈ జీఎస్ఎల్వీ రాకెట్‌లో మొత్తం మూడు విభాగాలుండగా . ఆర్బిటర్ అనే పరికరం ద్వారం ల్యాండర్, రోవర్‌లను చంద్రునిపై శాస్త్రవేత్తలు దింపనున్నారు. […]

54 రోజులు..  3.50 లక్షల కిలోమీటర్లు.. చంద్రయాన్- 2 ప్రయాణం
Follow us on

భారత అంతరిక్ష ప్రయోగకేంద్రం ఇస్రో ప్రతిష్టాత్మక చంద్రయన్ -2 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 20 గంటలపాటు నిర్విరామంగా సాగుతున్న ఈ ప్రక్రియలో భాగంగా రేపు తెల్లవారుజామున 2.51 గంటలకు 640 టన్నుల బరువుకలిగిన జీఎస్ఎల్వీ మార్క్ 3-ఎం1 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. ఇందులో 3.8 టన్నుల బరువైన చంద్రయాన్ 2- మిషన్‌ను సైంటిస్టులు అమర్చారు. ఈ జీఎస్ఎల్వీ రాకెట్‌లో మొత్తం మూడు విభాగాలుండగా . ఆర్బిటర్ అనే పరికరం ద్వారం ల్యాండర్, రోవర్‌లను చంద్రునిపై శాస్త్రవేత్తలు దింపనున్నారు. ఇందులో 1.4 టన్నుల బరువున్న ల్యాండర్‌కు విక్రమ్‌ అని, 27 కిలోల బరువైన రోవర్‌కు ప్రఙ్ఞాన్ అని పేర్లు పెట్టారు. వీటిలో 14 భారత పేలోడ్స్‌తోపాటు అమెరికా, ఐరోపాలకు చెందిన నాలుగు పేలోడ్స్‌ను ఉపగ్రహాంలో అమర్చారు.

నిర్విరామంగా 54 రోజులపాటు 3.50 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి సెప్టెంబర్ 6న చంద్రునికి 30 కిలోమీటర్ల ఎత్తులో దిగనుంది చంద్రయాన్-2. మొత్తం మూడు దశల్లో కక్ష్యలోకి దూసుకెళ్లనుండగా మూడో దశలో జియో ట్రాన్సర్ ఆర్బిట్‌లోకి చంద్రయాన్- 2 మిషన్ ప్రవేశిస్తుంది. ఇక్కడ రోవర్ అనే ఉపగ్రహం చంద్రునిచుట్టూ తిరుగుతూ పరిశోధనలు చేయనుంది. ఇప్పటికే చంద్రయాన్- 1 ద్వారా చంద్రునిపై నీటి జాడలు ఉన్నట్టు ఇస్రో కనుగొన్న నేపధ్యలో చంద్రయాన్ 2 ద్వారా మరిన్ని విశేషాలను తెలుసుకోబోతుంది.