అమరావతి ఓ బంగారు బాతు.. అది తెలియకనే పాపం జగన్..!

|

Dec 20, 2019 | 5:08 PM

అమరావతి రాజధాని విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ యాక్షన్ ప్లాన్‌ని మరోసారి ఎద్దేవా చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. అమరావతి ఓ బంగారు బాతు లాంటిదని, అది తెలియక ముఖ్యమంత్రి జగన్ యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు చంద్రబాబు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను సీఎంతోపాటు వైసీపీ నేతలు అపహాస్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అనంతపురం జిల్లా పర్యటనలో వున్న చంద్రబాబు శుక్రవారం రాజధాని సహా పలు అంశాలపై మాట్లాడారు. అమరావతి ఎంపికలోను, రాజధాని నిర్మాణంలోను అవినీతి […]

అమరావతి ఓ బంగారు బాతు.. అది తెలియకనే పాపం జగన్..!
Follow us on

అమరావతి రాజధాని విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ యాక్షన్ ప్లాన్‌ని మరోసారి ఎద్దేవా చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. అమరావతి ఓ బంగారు బాతు లాంటిదని, అది తెలియక ముఖ్యమంత్రి జగన్ యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు చంద్రబాబు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను సీఎంతోపాటు వైసీపీ నేతలు అపహాస్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అనంతపురం జిల్లా పర్యటనలో వున్న చంద్రబాబు శుక్రవారం రాజధాని సహా పలు అంశాలపై మాట్లాడారు.

అమరావతి ఎంపికలోను, రాజధాని నిర్మాణంలోను అవినీతి జరిగిందని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. వారి ఆరోపణల్లో నిజముంటే నిరూపించాలని సవాల్ చేశారు. అమరావతిని బంగారుబాతులా రూపొందించి జగన్ చేతిలో పెడితే ఆయన యూ టర్న్ తీసుకుని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని అన్నారు చంద్రబాబు. రాజధాని విషయంలో సందిగ్థత ఏర్పడగానే రాష్ట్రానికి పెట్టుబడుల రాక గణనీయంగా పడిపోయిందని చంద్రబాబు అన్నారు.

నిర్ణయం తల్లిదండ్రులకే వదిలేయాలి

ఉమ్మడి రాష్ట్రంలో టెక్నాలజీని ప్రమోట్ చేసింది తానేనని, తన వల్లే ఇవాళ ప్రపంచంలోని పలు దేశాల్లో తెలుగు వారు పలు హోదాల్లో రాణిస్తున్నారని చెప్పుకొచ్చారు చంద్రబాబు. తాను ఇంగ్లీషు మీడియంకు వ్యతిరేకం కాదని, కానీ తమ పిల్లలు విద్యాబోధనను ఏ భాషలో నేర్చుకోవాలనే విషయం పిల్లల తల్లిదండ్రులకు వదిలేయాలని ఆయన అంటున్నారు. టెక్నాలజీని ప్రమోట్ చేసిన తానున ఇంగ్లీషు ఎందుకు వద్దంటానని అన్నారాయన.