ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కాసేపట్లో ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. చిన్నగంజాం మండలం రుద్రామాంబపురంలో ఇటీవల వైసీపీ దాడితో అవమాన భారంతో ఆత్మహత్యకు పాల్పడ్డ బసంగారి పద్మ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు. పార్టీ తరపున ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందచేయనున్నారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు రుద్రామాంబపురం తరలివస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, ఏలూరి సాంబశివరావులు చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.