ఢిల్లీలో రైతు సంఘాల ఆందోళన ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో హోం మంత్రి అమిత్ షా చర్చల పరంపర కొనసాగిస్తున్నారు. ఎలాగైనా రైతులు, రైతు సంఘాల నేతలను ఆందోళన నుంచి విరమింపచేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. మొన్ననే రైతు సంఘాల నేతల్ని చర్చకు పిలిచి చర్చించినా రైతులు ఆందోళన విరమించలేదు. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై వ్యవసాయశాఖ మంత్రులతో అమిత్ షా సమావేశం నిర్వహిస్తున్నారు. అమిత్ షా నివాసంలో జరుగుతోన్న ఈ భేటీలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, సహాయ మంత్రి సోం ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.