75 లక్షల మంది వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చిన కేంద్రం

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయారు. తమతో పాటు కుటుంబసభ్యుల కడుపు నింపేందుకు ఇబ్బందులు పడ్డారు. కనీసం సొంతూర్లకు వెళ్లేందుకు నానావస్థలు పడ్డారు. దీంతో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్నవారిని స్వస్థలాలకు చేర్చేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా వలస కార్మికులు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో 4 కోట్ల మంది వలస కార్మికులు నివసిస్తున్నట్లు కేంద్ర హౌంమంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ పునియా సాలిలా శ్రీవాస్తవ తెలిపారు. […]

75 లక్షల మంది వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చిన కేంద్రం

Updated on: May 23, 2020 | 9:24 PM

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయారు. తమతో పాటు కుటుంబసభ్యుల కడుపు నింపేందుకు ఇబ్బందులు పడ్డారు. కనీసం సొంతూర్లకు వెళ్లేందుకు నానావస్థలు పడ్డారు. దీంతో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్నవారిని స్వస్థలాలకు చేర్చేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
దేశవ్యాప్తంగా వలస కార్మికులు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో 4 కోట్ల మంది వలస కార్మికులు నివసిస్తున్నట్లు కేంద్ర హౌంమంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ పునియా సాలిలా శ్రీవాస్తవ తెలిపారు. లాక్‌డౌన్‌ అమలు నాటి నుంచి ఇప్పటి వరకు 75 లక్షల మంది వలస కార్మికులు బస్సులు, రైళ్లలో తమ గమ్యస్థానాలకు చేరుకున్నారని శ్రీవాస్తవ పేర్కొన్నారు. వలస కార్మికులు మే 1నుంచి ఇప్పటి వరకు 2,600 శ్రామిక రైళ్లో తమ నివాసాలకు చేరుకున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు.
35 లక్షల మంది కార్మికలు ప్రత్యేక శ్రామిక్ రైళ్లలో ప్రయాణించగా, మిగతా 40 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించారని వెల్లడించారు అధికారులు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రభుత్వాలు కార్మికులకు మెరుగైన ఆహార, నివాస సదుపాయాలు కల్పించాయన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి అన్ని రాష్ట్రాలు వేగవంతమైన చర్యలు చేపట్టాయని తెలిపారు. వలస కార్మికల కోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు శ్రీవస్తవ తెలిపారు.