లాకప్‌లు, ఇంటరాగేషన్ రూమ్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు..

|

Dec 02, 2020 | 8:26 PM

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని సీబీఐ, ఈడీ, ఎన్‌ఐఏ కార్యాలయాల్లో వెంటనే సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

లాకప్‌లు, ఇంటరాగేషన్ రూమ్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు..
Follow us on

Supreme Court Key Orders: కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని సీబీఐ, ఈడీ, ఎన్‌ఐఏ కార్యాలయాల్లో వెంటనే సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వివిధ కేసుల దర్యాప్తుతో పాటు నిందితులను అరెస్ట్‌ చేసే అధికారం ఉన్న దర్యాప్తు సంస్ధల్లో ప్రతి చోట సీసీటీవీలు కంపల్సరీ అని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.

జస్టిస్‌ నారిమన్‌ నేతృత్వంలోని బెంచ్‌ అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని పోలీసు స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్స్‌లో లాక్‌ప్‌లో, కారిడార్లలో, లాబీల్లో, రిసెప్షన్‌ ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మానవహక్కుల ఉల్లంఘన జరగకుండా ఉండేందుకు ఇది అవసరమని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Also Read: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. తగ్గించిన వేతనాలు చెల్లింపుకు కీలక ఉత్తర్వులు…