జగన్‌‌ది లక్షకోట్ల అవినీతి కాదు: లక్ష్మీనారాయణ న్యూట్విస్ట్

ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులను దర్యాప్తు చేసి అందరిలో పాపులర్ అయిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. తాజాగా ఆ కేసుకు సంబంధించిన సంచలన కామెంట్లు చేశారు. జగన్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారనడం రాజకీయ ఆరోపణలేనని ఆయన వ్యాఖ్యానించారు. తమకు లభించిన ఆధారాల ప్రకారం జగన్‌ రూ.1,366కోట్ల మేరకే అవినీతికి పాల్పడ్డట్లు ఆధారాలు ఉన్నాయని.. దాన్నే తాము చార్జ్‌షీట్‌లో పొందుపరిచామని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రచారం కోసం […]

జగన్‌‌ది లక్షకోట్ల అవినీతి కాదు: లక్ష్మీనారాయణ న్యూట్విస్ట్

Edited By:

Updated on: Apr 24, 2019 | 11:58 AM

ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులను దర్యాప్తు చేసి అందరిలో పాపులర్ అయిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. తాజాగా ఆ కేసుకు సంబంధించిన సంచలన కామెంట్లు చేశారు. జగన్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారనడం రాజకీయ ఆరోపణలేనని ఆయన వ్యాఖ్యానించారు. తమకు లభించిన ఆధారాల ప్రకారం జగన్‌ రూ.1,366కోట్ల మేరకే అవినీతికి పాల్పడ్డట్లు ఆధారాలు ఉన్నాయని.. దాన్నే తాము చార్జ్‌షీట్‌లో పొందుపరిచామని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రచారం కోసం ఎవరో జగన్‌పై ఆరోపణలు చేసి, వాడుకుంటుంటే తానేమీ చేయలేనని తెలిపారు. ఇదిలా ఉంటే ఇటీవల ఏపీలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో లక్ష్మీనారాయణ జనసేన పార్టీ తరఫున విశాఖపట్నం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే.