కరోనా కాలంలో ‘క్యాప్ జెమినీ’ ఇండియా సంచలన నిర్ణయం..

| Edited By:

Apr 16, 2020 | 12:02 PM

కోవిద్-19 మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ఈ కల్లోల సమయంలోనూ ఫ్రెంచ్ ఐటీ సర్వీసుల కంపెనీ కాప్ జెమినీ సంచలన నిర్ణయం తీసుకుంది. భారతదేశంలోని కాప్ జెమినీ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న 70

కరోనా కాలంలో క్యాప్ జెమినీ ఇండియా సంచలన నిర్ణయం..
Follow us on

కోవిద్-19 మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ఈ కల్లోల సమయంలోనూ ఫ్రెంచ్ ఐటీ సర్వీసుల కంపెనీ క్యాప్ జెమినీ సంచలన నిర్ణయం తీసుకుంది. భారతదేశంలోని క్యాప్ జెమినీ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న 70 శాతం సిబ్బంది అంటే 84వేల మందికి ఏప్రిల్ 1వతేదీ నుంచి జీతభత్యాలు పెంచాలని నిర్ణయించారు. మిగిలిన ఉద్యోగులకు కూడా జులై నెల నుంచి ఇంక్రిమెంట్లు ఇవ్వాలని క్యాప్ జెమినీ ఇండియా యాజమాన్యం నిర్ణయించింది. కరోనా కష్టకాలంలోనూ ఐటీ ఉద్యోగుల సంక్షేమానికి క్యాప్ జెమినీ అసాధారణ చర్యలు తీసుకుంది.

కాగా.. ప్రాజెక్టులు లేని బెంచ్ మీద ఉన్న ఉద్యోగులను నిలుపుకునేందుకు వీలుగా వారికి కూడా జీతాలు చెల్లించాలని కంపెనీ నిర్ణయించింది. బెంచ్ టైమ్ తో సంబంధం లేకుండా ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామని క్యాప్ జెమినీ ఇండియా సీఈఓ అశ్విన్ యార్డీ వివరించారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులకు షిఫ్ట్ అలవెన్సును ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. దీంతోపాటు ఏప్రిల్ నెలలో ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రమోషన్లు జులై 1 నుంచి అమలు చేస్తామని కంపెనీ సీఈఓ ప్రకటించారు.

Also Read: లాక్‌డౌన్ 2.0: హైదరాబాద్‌లో నయా రూల్స్.. ఫాలో అవ్వాల్సిందే..