టెన్త్ ఎగ్జామ్స్‌ని మొత్తానికే రద్దు చేయండి.. మంచు హీరో సంచలన వ్యాఖ్యలు

| Edited By:

Jun 29, 2020 | 6:25 PM

విద్యార్థులకు పదో తరగతి బోర్డు పరీక్షల నిర్వహణపై హీరో మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్.. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆయన ఏం ట్వీట్ చేశారంటే.. 'టెన్త్ స్టూడెంట్స్‌కి బోర్డు పరీక్షలు నిర్వహించే విధానం పూర్తిగా రద్దు..

టెన్త్ ఎగ్జామ్స్‌ని మొత్తానికే రద్దు చేయండి.. మంచు హీరో సంచలన వ్యాఖ్యలు
Follow us on

విద్యార్థులకు పదో తరగతి బోర్డు పరీక్షల నిర్వహణపై హీరో మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్.. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆయన ఏం ట్వీట్ చేశారంటే.. ‘టెన్త్ స్టూడెంట్స్‌కి బోర్డు పరీక్షలు నిర్వహించే విధానం పూర్తిగా రద్దు చేస్తే బాగుంటుంది. ఈ ఏడాదే కాకుండా పూర్తిగా ఈ విధానం రద్దు చేయబడాలని నేను బలంగా కోరుకుంటున్నారు. ఈ బోర్డు ఎగ్జామ్స్‌ వల్ల 14, 15 సంవత్సరాల పిల్లలపై తీవ్రంగా ఒత్తిడి పడుతుంది. విద్యార్థులపై ఒత్తిడి అవసరమా? ఈ పరీక్షల ఉద్ధేశం ఏమిటి?’ అంటూ మంచు హీరో ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఈ న్యూస్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. కొంతమంది నెటిజన్లు విష్ణు అభిప్రాయంతో ఏకీభవిస్తుంటే.. మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. గతంలో కూడా 7వ తరగతిలో బోర్డు ఎగ్జామ్ ఉండేదని.. ఆ తర్వాత తీసేశారని పేర్కొంటున్నారు. కాగా ఈ ఏడాది కరోనా వైరస్ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశంలోని పలు రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే.