త్రివిక్రమ్‌తో బన్నీ.. ‘అల వైకుంఠానికి’ పడే హిట్లు ఎన్ని.?

|

Jan 07, 2020 | 5:33 PM

త్రివిక్రమ్ సెల్యులాయిడ్… ప్రేక్షకులను థియేటర్ల వరకు తీసుకురావడానికి స్క్రీన్ మీద ఈ ఒక్క పేరు చాలు. హీరోతో సంబంధం లేకుండా సినిమాను తన ఫేమ్‌తో ఆడించగలిగిన డైరెక్టర్లలో ఒకరు త్రివిక్రమ్ శ్రీనివాస్. మాటల మాంత్రికుడిగా ఈయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కోకొల్లలు. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబినేషన్‌లో సంక్రాంతికి ‘అల.. వైకుంఠపురంలో’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వీరిద్దరి కలయికలో వస్తోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. అందుకే చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ప్రచారంలో […]

త్రివిక్రమ్‌తో బన్నీ.. అల వైకుంఠానికి పడే హిట్లు ఎన్ని.?
Follow us on

త్రివిక్రమ్ సెల్యులాయిడ్… ప్రేక్షకులను థియేటర్ల వరకు తీసుకురావడానికి స్క్రీన్ మీద ఈ ఒక్క పేరు చాలు. హీరోతో సంబంధం లేకుండా సినిమాను తన ఫేమ్‌తో ఆడించగలిగిన డైరెక్టర్లలో ఒకరు త్రివిక్రమ్ శ్రీనివాస్. మాటల మాంత్రికుడిగా ఈయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కోకొల్లలు.

ఇక ప్రస్తుతం త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబినేషన్‌లో సంక్రాంతికి ‘అల.. వైకుంఠపురంలో’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వీరిద్దరి కలయికలో వస్తోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. అందుకే చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతూ చిత్ర యూనిట్ విడుదల చేసిన అన్ని పాటలకూ కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కానీ టీజర్‌కు మాత్రం మిశ్రమ స్పందన రావడం గమనార్హం.

ఇదిలా ఉంటే త్రివిక్రమ్ ఇమేజ్ కొంతకాలంగా మందకొడిగా సాగుతోందని వార్తలు వస్తున్నాయి. 2018లో పవన్ కళ్యాణ్ హీరోగా తీసిన ‘అజ్ఞాతవాసి’ సినిమా ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా  నిలవడమే కాకుండా ఇమేజ్‌ను కూడా పూర్తిగా దెబ్బతీసింది. కానీ గురూజీ వెంటనే బౌన్స్ బ్యాక్‌ అయ్యారు. ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత’ తీసి పెద్ద హిట్ సాధించారు. అయితే ఈ మూవీకి కూడా కొన్ని అంశాలలో నెగటివ్ కామెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఇలాగే భారీ హైప్ తెచ్చుకున్న సినిమాలు గతంలో డిజాస్టర్లుగా మారాయి. వాటిల్లో మహేష్- మురుగదాస్ కాంబోలో వచ్చిన ‘స్పైడర్’ ఒకటి కాగా.. త్రివిక్రమ్ ‘అజ్ఞాతవాసి’ మరొకటి. మరి త్రివిక్రమ్ గత సినిమాల్లోని పొరపాట్లను ‘అల వైకుంఠపురంలో’ పునరావృతం కాకుండా చూసుకుంటారా లేదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.