అభిమాని పాదయాత్ర, బన్నీ ఎమోషనల్

అతడికి అల్లు అర్జున్ అంటే ప్రాణం. తన అభిమాన హీరోని కలవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. కానీ అదంత చిన్న విషయం కాదు. బన్నీని కలవడానికి లక్షల మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.

అభిమాని పాదయాత్ర, బన్నీ ఎమోషనల్

Updated on: Oct 03, 2020 | 1:35 PM

అతడికి అల్లు అర్జున్ అంటే ప్రాణం. తన అభిమాన హీరోని కలవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. కానీ అదంత చిన్న విషయం కాదు. బన్నీని కలవడానికి లక్షల మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. అందుకే వినూత్న పంథాను ఎన్నుకున్నాడు నాగేశ్వరరావు అనే అభిమాని. తన స్వగ్రామం మాచర్ల మండలం ఖమ్మం పాడు నుంచి హైద‌రాబాద్ పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ వెంటనే అతడిని ఆపి హైదరాబాద్ తీసుకుర్మని తన టీమ్ కు చెప్పారు.  అప్ప‌టి నుండి అల్లు అర్జున్ టీం అంతా అత‌ని కాంటాక్ట్ కోసం ప్ర‌యత్నాలు చేసినా, ఫలితం దక్కలేదు. చివ‌ర‌కి 6 రోజుల త‌రువాత హైద‌రాబాద్ చేరుకున్న నాగేశ్వరరావుని అల్లు అర్జున్ టీం క‌లిసి నిన్న సాయంత్రం బన్నీ వద్దకు తీసుకెళ్లారు.

అల్లు అర్జున్ నాగేశ్వరరావుని క‌లిసి యెగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రోజుకు 35 కిలోమీట‌ర్ల నుంచి 40 కిలోమీట‌ర్లు న‌డిచాను అని చెప్ప‌గానే ఒక్క క్ష‌ణం అల్లు అర్జున్ క‌ళ్లలో నీళ్లు తిరిగాయి. “ఎందుకు ఇలా చేశావు.. ఈరోజు కాక‌పోతే రేపు అభిమానుల్ని క‌లుస్తాను క‌దా ఇలా చేయ‌టం వ‌ల‌న మీ ఆరోగ్యం ఏమ‌యినా అయితే నేను ఎలా హ్య‌పిగా వుంటాను” బన్నీ అభిమానిని ప్రశ్నించాడు. నాగేశ్వరరావు మాట్లాడుతూ.. “15 సంవ‌త్స‌రాల నుండి మీకు నేను పెద్ద అభిమానిని. మీ అన్ని ఫంక్ష‌న్స్ కి వ‌చ్చాను. మిమ్మ‌ల్ని క‌ల‌వ‌టమే ధ్యేయంగా అప్ప‌టిక‌ప్పుడు అనుకుని మా ఊరి నుంచి పాదయాత్ర మొదలు పెట్టాను” అని తెలిపాడు.

అతడి మాటలకు స్పందించిన అల్లు అర్జున్.. “మాస్క్ వేసుకుని వ‌చ్చావు బాగుంది .. దారిలో గుళ్లలో ప‌డుకున్నాన‌ని చెప్తున్నావు. చాలా క‌ష్ట‌ప‌డి వ‌చ్చావు బాగుంది. నా మీద నీకున్న అభిమానానికి చాలా హ్య‌పీగా ఉంది. కానీ ఇలా న‌డిచి రావ‌టం చాలా బాధగా ఉంది. ఇలాంటివి మీ భ‌విష్య‌త్తు కోసమో, మీ ఫ్యామిలి కొస‌మో చేస్తే అప్పుడు నేను చాలా గ‌ర్వంగా ఫీలవుతాను. మరోసారి ఇలా చెయ్యాలి అనుకుంటే మాత్రం నీ కోసం, నీ ఫ్యామిలీ కొసం చెయ్యి ” అని అల్లు అర్జున్ అభిమానికి చెప్పారు. త‌న అభిమానికి గుర్తుగా మొక్కని గిఫ్ట్ గా ఇచ్చారు బన్నీ. తనకు వీలున్నప్పుడల్లా అభిమానుల్ని క‌లిసే ప్ర‌య‌త్నం చేస్తానని చెప్పారు.

Also Read :

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య