Budget Session 2020: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభ సాక్షిగా తెలంగాణ ఏర్పాటుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తీరును తప్పుబడుతూ.. పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ బిల్లును యుపీఏ ప్రభుత్వం హడావుడిగా ఆమోదించిందని విమర్శించారు. టీవీలను ఆపేసి, చర్చలు కూడా తావివ్వకుండా బిల్లును ఆమోదించారని చెప్పుకొచ్చారు.
కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటప్పుడు అందరి అభిప్రాయాలను సేకరించాలని.. అటు ఏపీ ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోలేదని కాంగ్రెస్‌పై మోదీ విరుచుకుపడ్డారు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ ఘటనను ఎప్పటికీ మర్చిపోలేరని మోదీ స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు రాలేదని అన్నారు. జమ్మూకాశ్మీర్‌ను కూడా పార్లమెంట్‌లో సుదీర్ఘ చర్చ తర్వాతే విభజించామని మోదీ అన్నారు.