బ్రెజిల్‌లో ప్రమాదకరంగా కరోనా మరణాలు

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది.  బ్రెజిల్‌లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. సోమవారం ఒక్కరోజే ఆ దేశంలో 271 మంది వైరస్ కారణంగా మరణించినట్లు ప్రభుత్వం తెలిపింది.

బ్రెజిల్‌లో ప్రమాదకరంగా కరోనా మరణాలు

Updated on: Oct 20, 2020 | 5:50 PM

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది.  బ్రెజిల్‌లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. సోమవారం ఒక్కరోజే ఆ దేశంలో 271 మంది వైరస్ కారణంగా మరణించినట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 154,176 కు పెరిగింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, కొత్తగా 15,383 కొత్త కేసులు నిర్ధారించబడ్డాయి.  ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 5250727 కు చేరుకుంది. కరోనా వైరస్‌కు టీకాలు వేయడం తప్పనిసరి కాదని, అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పుడు ప్రజలు ఉచితంగా అందిస్తామని బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో అన్నారు. దేశంలో అధిక జనాభా ఉన్న, పారిశ్రామిక ప్రాంతమైన  సావో పాలోలో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది.  ఫిబ్రవరి 26 న మొదటి కేసు కనుగొనబడినప్పటి నుంచి అక్కడ 38,035 మరణాలు, 1064039 కేసులు వెలుగుచూశాయి. 

Also  Read :

Hyderabad Floods : ఎన్ని కష్టాలు వచ్చాయ్ బ్రదర్ !

Bigg Boss Telugu 4 : అరియానాకు పెరుగుతోన్న ఫాలోయింగ్ !