బ్రెజిల్ సూపర్ హీరో రేయాన్ రేనాల్డ్స్ కి తృటిలో ప్రమాదం తప్పింది. తన తాజా చిత్రం ‘ ఫ్రీ గై ‘ ప్రమోషన్ కోసం శనివారం బ్రెజిల్ లోని సావోపాలో చేరుకున్న ఇతడ్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఎగబడ్డారు. 43 ఏళ్ళ ఈ నటుడు పాల్గొన్న కార్యక్రమం వేదిక వీరితో నిండిపోయింది. తన అభిమానులను గ్రీట్ చేసేందుకు రేయాన్ వేదికపై నుంచే కాస్త ముందుకు వస్తుండగా హఠాత్తుగా స్టేజీ సమీపంలోని బ్యారియర్ వారి తొక్కిసలాటతో కూలిపోయింది. ఈ ఘటనలో చాలామంది కింద పడిపోయారు. కొంతమందికి స్పల్ప గాయాలయ్యాయి. అయితే అప్రమత్తమైన రేయాన్.. వెంటనే వెనక్కి తిరిగి స్టేజీ మీదికి జంప్ చేసి తనను తాను కాపాడుకున్నాడు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఈ హీరో తన ఫ్యాన్స్ తో బాటు కింద పడిపోయేవాడే.. అంత టెన్షన్ వాతావరణంలోనూ ఇతగాడు నిబ్బరంగా వ్యవహరించాడు. అన్నట్టు ఇతని ‘ ఫ్రీ గై ‘ కామెడీ మూవీ ప్రీమియర్ ని వచ్ఛే ఏడాది జులైలో ప్రదర్శించనున్నారు. .