
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రజత్ ముఖర్జీ కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఈ రోజు తుది శ్వాస విడిచారు. ‘రోడ్, ప్యార్ తూనే క్యా కియా, లవ్ ఇన్ నేపాల్’ వంటి చిత్రాలతో ఫేమస్ అయ్యారు రజత్ ముఖర్జీ. ‘రోడ్’ మూవీకి డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరించారు. కాగా రజత్ ముఖర్జీ మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ.. ట్విట్టర్లో ట్వీట్లు పెడుతున్నారు.
‘రజత్ ముఖర్జీ మృతి పట్ల నటుడు మనోజ్ బాజ్పాయి ట్విట్టర్లో సంతాపం వెల్లడించారు. తన స్నేహితుడు, రోడ్ దర్శకుడు రజత్ జైపూర్లో కన్నుమూశారని, ఆయన ఆత్మకు శాంతికలగాలని’ పోస్టు చేశారు మనోజ్ బాజ్పాయి.