ప‌శ్చిమ‌బెంగాల్‌పై క‌మ‌ల‌ద‌ళం స్పెష‌ల్ ఫోక‌స్‌‌.. ఇక‌పై నెల‌కు ఏడు రోజులు బెంగాల్‌లో మ‌కాం వేయ‌నున్న అమిత్ షా..!

|

Dec 21, 2020 | 12:02 PM

ప‌శ్చిమ‌బెంగాల్‌పై బీజేపీ స్పెష‌ల్‌ ఫోక‌స్ పెట్టింది. తృణ‌మూల్ అధికార పీఠాన్ని దించేలా రాజ‌కీయంగా దెబ్బ‌కొట్టాల‌ని ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో..

ప‌శ్చిమ‌బెంగాల్‌పై క‌మ‌ల‌ద‌ళం స్పెష‌ల్ ఫోక‌స్‌‌.. ఇక‌పై నెల‌కు ఏడు రోజులు బెంగాల్‌లో మ‌కాం వేయ‌నున్న అమిత్ షా..!
Follow us on

ప‌శ్చిమ‌బెంగాల్‌పై బీజేపీ స్పెష‌ల్‌ ఫోక‌స్ పెట్టింది. తృణ‌మూల్ అధికార పీఠాన్ని దించేలా రాజ‌కీయంగా దెబ్బ‌కొట్టాల‌ని ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో వ్యూహాలు ర‌చిస్తోంది బీజేపీ. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా కాన్వాయ్‌పై దాడి జ‌ర‌గ‌నంత వ‌ర‌కు బెంగ‌ల్ రాజ‌కీయాలు ఒక ఎత్తైతే.. కాన్వాయ్‌పై దాడి జ‌రిగిన త‌ర్వాత ఒక ఎత్తైంది. ఈ ఘ‌ట‌న‌లో బెంగాల్‌పై కాషాయ ద‌ళం ప్ర‌త్యేక దృష్టి సారిస్తోంది. ఏకంగా 9 మంది ఎమ్మెల్యేల‌ను, ఓ ఎంపీకి బీజేపీ కండువా క‌ప్పి అటు అధికార పార్టీకి, ఇటు విప‌క్షాల‌కు గ‌ట్టి షాకిచ్చింది. అంతేకాకుండా ఏకంగా ఆరుగురు కేంద్ర మంత్రుల‌ను బెంగాల్‌కు పంపింది క‌మ‌ళ‌ద‌ళం.

నెల‌లో 15 రోజుల పాటు బెంగాల్‌లో మ‌కాం వేయాల‌ని నిర్ణ‌యించింది. ఏలాగైనా ఈ సారి బెంగాల్‌లో బీజేపీ జెండా పాతాల‌ని ప‌దునైనా వ్యూహాలు ర‌చిస్తోంది. అంతేకాకుండా మ‌రో కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇక‌పై నెల‌కోసారి ఖ‌చ్చితంగా బెంగాల్‌లో ప‌ర్య‌టించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. కేవ‌లం ప‌ర్య‌టించ‌డ‌మే కాకుండా నెల‌కు ఏడు రోజుల పాటు అక్క‌డే మ‌కాం వేస్తార‌ని బీజేపీ అధ్య‌క్షుడు దిలీప్ ఘోష్ ప్ర‌కటించారు. ఇక‌పై అమిత్ త‌ర‌చూ బెంగాల్ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తారు.. ఓ నెల‌లో ఏడు రోజుల పాటు బెంగాల్‌లో మ‌కాం వేసి దిశానిర్దేశం చేస్తార‌ని తెలిపారు.

బీజేపీ వ్యూహం ఫ‌లిస్తుందా..?
వ‌చ్చే ఎన్నిక‌ల్లో బెంగాల్ అధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని ఇప్ప‌టి నుంచి క‌మ‌ల ద‌ళం ఉవ్విళ్లూరుతోంది. ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్తోంది. ఇటీవ‌ల జేపీ న‌డ్డా కాన్వాయ్ పై దాడి జ‌రిగిన నేప‌థ్యంలో బెంగాల్‌పై బీజేపీ మ‌రింత దృష్టి సారించింది. ముందు నుంచే ప‌క్కా ప్లాన్ వేసి బెంగాల్ ఓట‌ర్ల‌ను త‌మ వైపు తిప్పుకోవాల‌న్న‌ది బీజేపీ ల‌క్ష్యం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బెంగాల్ అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే ముందు నుంచే వ్యూహాలు ర‌చిస్తోంది బీజేపీ. మ‌రి బెంగాల్ పై క‌షాయ ద‌ళం వేస్తున్న వ్య‌వూహాలు ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయో చూడాలి.