చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, రాజాసింగ్.. పోలీసుల భారీ బందోబస్త్..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే రాజాసింగ్ సహా.. జీహెచ్ఎంసీ పరిధిలో..

చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, రాజాసింగ్.. పోలీసుల భారీ బందోబస్త్..

Updated on: Dec 18, 2020 | 9:18 AM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే రాజాసింగ్ సహా.. జీహెచ్ఎంసీ పరిధిలో నూతనంగా ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘన విజయం సొంతం చేసుకున్న నేపథ్యంలో బండి సంజయ్.. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయ ప్రాంగాణంలో జైశ్రీరామ్ నినాదాలు చేశారు. కాగా, బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో పాతబస్తీలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డేగ కళ్లతో నిఘా ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్య రీతిలో పుంజుకున్న బీజేపీ.. 48 కార్పొరేట్ స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలిస్తే అమ్మవారికి మొక్కలు చెల్లించుకుంటానని బండి సంజయ్ గతంలోనే ప్రకటించారు. ఆ ప్రకటన మేరకు నేడు ఆయన భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు.

 

Also read:

Ayodhya Masjid: అయోధ్యలో మసీదు నిర్మాణానికి జనవరి 26వ తేదీన శంకుస్థాపన.. ప్రకటించిన ట్రస్ట్ సభ్యులు..

వలసలతోనే అభివృద్ధి.. వలస కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక తీర్మానం.. నేడు అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం