బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా..!

బీజేపీ యువ నేత జ్యోతిరాదిత్య సింధియా ఆయనతో పాటు తల్లి మాధవి రాజే సింధియాకి కూడా కరోనా.

బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా..!

Edited By:

Updated on: Jun 09, 2020 | 3:48 PM

కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా విజృంభణ కొనసాగుతోంది. సామాన్యుడి నుంచి సెలబ్రేటీల వరకు దీని బారినపడుతున్నారు. తాజాగా బీజేపీ యువ నేత జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు ఆయన తల్లి మాధవి రాజే సింధియా కూడా కరోనా బారిన పడ్డారని సమాచారం. నాలుగు రోజులుగా జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నారు. దీంతో కరోనా లక్షణాలతో హోం క్వారంటైన్ లో ఉన్న వీరిని వైద్యులు పరీక్షలు చేశారు. దీంతో కొవిడ్ 19 పాజిటివ్ తేలడంతో ఢిల్లీలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వారిద్దరినీ తరలించి చికిత్స అందిస్తున్నారు. నాలుగు రోజులుగా సింధియాలకు చికిత్స అందుతోంది. జ్యోతిరాదిత్యలో కరోనా లక్షణాలు బయటపడగా ఆయన తల్లిలో మాత్రం ఎలాంటి లక్షణాలూ బయటపడలేదు. ప్రస్తుతం వీరికి పూర్తి స్థాయిలో వైద్యం అందుతున్నట్లు అధికారులు తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us