Raja singh : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వాయిస్ ఉన్నట్లు భావిస్తున్న ఆడియో ఆ పార్టీలో కలకలం సృష్టిస్తోంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు, బండి సంజయ్ తనకు అన్యాయం చేశారంటూ ఆడియోలో ఉంది. తన అనుచరులకు గన్‌ఫౌండ్రీ, బేగంబజార్ టికెట్లు అడిగితే ఇవ్వలేదని, తన గోషామహల్ నియోజకవర్గాన్ని తనకు వదిలేయాలని రిక్వెస్ట్ చేసినా వినలేదని, 2018లో తన విజయానికి కృషి చేసిన వ్యక్తికి టికెట్ ఇప్పించలేకపోయానని రాజాసింగ్ వాపోయినట్లుగా ఆడియోలో ఉంది.
అయితే ఈ ఆడియోపై ఎమ్మెల్యే రాజా సింగ్ రీ ట్వీట్ చేశారు. కొందరు కావాలనే ఇలాంటివి సర్యులేట్ చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రత్యర్ధులు చేస్తున్న కుట్రని రాజాసింగ్ ట్విటర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.
ये मैने नही कहा है, कोई मेरे नाम से ये गलत एडिटिंग करके पार्टी का मनोबल तोड़ने की कोशिश कर रहा है हम साइबर क्राइम में इसके खिलाफ कंप्लेंट करेंगे।
Few people have been circulating morphed content using my name. pic.twitter.com/L5h8HeTQXp
— Raja Singh (@TigerRajaSingh) November 22, 2020