Bird Flu Outbreak: తెలంగాణాలో బర్ద్ ఫ్లూ కలకలం.. వికారాబాద్ జిల్లాలో కాకులు, కోళ్లు మృతి… ఆందోళనలో స్థానికులు
దేశంలో అనేక రాష్ట్రాలను కలవర పెడుతున్న బర్ద్ ఫ్లూ తెలుగు రాష్ట్రాలకు ఇప్పటి వరకూ దూరంగా ఉంది. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో బర్ద్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది...

Bird Flu Outbreak: దేశంలో అనేక రాష్ట్రాలను కలవర పెడుతున్న బర్ద్ ఫ్లూ తెలుగు రాష్ట్రాలకు ఇప్పటి వరకూ దూరంగా ఉంది. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో బర్ద్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మరణించిన కోళ్లను, పక్షుల శాంపిల్స్ ను పరీక్షించిన అధికారులు ఇప్పటి వరకూ తెలంగాణాలో బర్ద్ ఫ్లూ అడుగు పెట్టలేదన్నారు. అసలు వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు.. అయితే తాజాగా వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం దోర్నల్ గ్రామంలో గత మూడు రోజులుగా కాకులు, కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బర్ద్ ఫ్లూ భయం గ్రామస్తులను కలవర పెడుతుంది. ఆ గ్రామంలో పర్యటించిన అధికారులు నమూనాలను సేకరించినట్లు సమాచారం. టెస్ట్ కోసం ల్యాబ్ కు పంపించినట్లు రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. కోళ్లు., పక్షుల మృతికి కారణం ఏమిటి అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read: