Bigg Boss Telugu : భారీ రేటింగ్‌‌‌‌‌‌‌తో దూసుకుపోయిన బిగ్ బాస్ షో.. నాలుగో సీజన్ టీఆర్ఫీ ఎంతంటే..

|

Dec 31, 2020 | 8:26 PM

బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో మంచి ప్రేక్షాదరణ పొందుతుంది. ఇటీవలే విజయవంతంగా నాలుగో సీజన్ ను పూర్తి చేసుకుంది బిగ్ బాస్...

Bigg Boss Telugu : భారీ రేటింగ్‌‌‌‌‌‌‌తో దూసుకుపోయిన బిగ్ బాస్ షో.. నాలుగో సీజన్ టీఆర్ఫీ ఎంతంటే..
Follow us on

Bigg Boss Telugu : బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో మంచి ప్రేక్షాదరణ పొందుతుంది. ఇటీవలే విజయవంతంగా నాలుగో సీజన్ ను పూర్తి చేసుకుంది బిగ్ బాస్. గత మూడు సీజన్స్ లానే ఈ సీజన్ కూడా ఆసక్తికరంగా సాగింది. హౌస్  ఎలిమినేట్ అవుతారు ఎవరు విన్నర్ అవుతారని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఊహించని విధంగా సాగిన ఎలిమినేషన్, ఉత్కంఠగా సాగిన ఫినాలే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 4 భారీ టీఆర్ఫీని కూడా సొంతం చేసుకుంది. తొలి సీజ‌న్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌గా ఆ సీజన్ ఫినాలే కార్య‌క్ర‌మానికి 14.13 టీ ఆర్పీ రేటింగ్ వ‌చ్చింది. ఆతర్వాత బిగ్ బాస్ 2 ను నాని హోస్ట్ చేశారు. ఆ సీజ‌న్ ఫినాలేకు వెంక‌టేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ ఫినాలే ఎపిసోడ్‌కు 15.05 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇక బిగ్ బాస్ సీజన్ మూడు, నాలుగు లకు కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. ఈ రెండు సీజ‌న్స్ ఫినాలేకు అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజ‌ర‌య్యారు. వాటిలో మూడో ఎపిసోడ్‌కు 18.29 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇక ఉత్కంఠగా సాగిన నాలుగో సీజన్ కు 19.51 టీఆర్పీ రేటింగ్‌తో సంచ‌ల‌నం సృష్టించింది. గెస్ట్ గా ఎవరు వస్తారన్నది చివరివరకు సస్పెన్స్ గా ఉంచారు. ఇక విన్నర్ ఎవరవుతారన్న ఉత్కంఠ కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది. దాంతో ఈ సీజన్ 4 కు భారీ టీఆర్ఫీ దక్కింది.

ALSO READ : Tiktok Star Durga Rao : సినిమాల్లోకి అడుగు పెడుతున్న దుర్గారావు.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ !