అది బిగ్ బాస్ హౌస్..అందునా సీజన్ చివరికి వచ్చింది. దీంతో క్షణ క్షణానికి రిలేషన్స్.. ఎమోషన్స్ మారిపోతున్నాయి. ఇన్నాళ్లు చెట్టాపట్టాలేసుకు తిరిగిన అఖిల్.. మోనాల్ మధ్య ఇప్పుడు గ్యాప్ పెరుగుతోంది. ఈ వీక్ నామినేషన్ ప్రాసెస్‌తో ఆ గ్యాప్ బ్రేకప్ దాకా వెళ్లిపోయింది. అంతేకాదు హౌస్‌మెట్స్ అంతా మోనాల్‌నే టార్గెట్ చేయటంతో అమ్మడు తత్వం తెలుసుకుంది. పేరెంట్స్ వచ్చి వెళ్లిన తర్వాత మోనాల్ ఆటతీరులో అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది. గతంలో ఆమెకు సహచర సభ్యులెవరూ గిఫ్ట్స్ పంపలేదు. పేరెంట్స్ వచ్చినప్పడు టాప్ 5 కి ఎవరు వెళ్తారు అనుకుంటున్నారని నాగార్జున అడగ్గా, మోనాల్ మదర్, అభిజిత్ ఫాదర్ తప్ప ఎవరూ ఆమె టాప్ 5 కు చేరకుంటుందని చెప్పలేదు.
లక్ చేతికందినట్టే అంది చేజారిన మోనాల్ ఫైనల్‌గా ఈ వీక్ నామినేషన్ లో పడిపోయిన విషయం తెలిసిందే. అయితే మాత్రం ఆమెకు ఓ రేంజ్ ఓటింగ్ పడుతున్నట్లు ఇన్ సైడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎందుకుంటే హారికను కెప్టెన్ అవ్వడానికి ప్రధాన కారణం మోనాల్. తన భుజ బలంతో కెప్టెన్సీ టాస్కులో ఆమెను విజేతను చేసింది. అయితే హారిక తన ప్రత్యేక పవర్‌తో అభిజిత్‌ను సేవ్ చేసింది. దీంతో సీన్ రివర్సయ్యింది. హారికను అభిమానించేవారు, అభిని విజేతగా నిలపాలనుకుంటున్న వారు..మోనాల్‌కు ఓట్లు గుద్దేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం ఆమెకు 50 శాతం పైగానే ఓట్లు వచ్చినట్టు సమాచారం అందుతోంది. అంటే ఈ వారం నామినేషన్ నుంచి మోనాల్ ఆల్మోస్ట్ సేవ్ అయినట్లే. అయితే ఇది బిగ్ బాస్ హౌస్. ఏమైనా జరగొచ్చు. లెట్స్ వెయిట్ అండ్ సీ.
మళ్లీ ప్రేమలో పడ్డ ఆమిర్ కుమార్తె, ఫిట్‌నెస్ ట్రైనర్‌తో ప్రయాణం షురూ, ప్రస్తుతం డేటింగ్‌లో !