మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 4 ముగిసిపోబోతుంది. హౌస్ లో మిగిలిన సభ్యులు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు బిగ్ బాస్ రకరకాల టాస్కులు ఇస్తున్నారు. ఈ టాస్క్ ల్లో భాగంగా స్టేజ్ పైన చిన్న సైజ్ షూ ధరించి డాన్స్ చేయమని చెప్పాడు. మధ్య మధ్య మ్యూజిక్ ఆపేస్తానని.. అప్పుడు ఒకరు కిందకు దిగాలని చెప్పాడు. ఎవరు దిగాలిఇంటిసభ్యులు నిర్ణయించుకొని దిగాలని సూచించాడు.
దాంతోపాటు ఎవ్వరుకూడా స్టేజ్ పైన కూర్చోవడం కానీ, నిలబడటం కానీ చేయకూడదు అని కండీషన్ పెట్టాడు బిగ్ బాస్. ఇక ఈ టాస్క్ లో చివరి వరకు స్టేజీపై ఎవరు ఉంటారో వారికి గోల్డెన్ మైక్ లభిస్తుందని చెప్పాడు. మొదటి సారి మ్యూజిక్ ఆగిపోవడంతో ఇంటిసభ్యులంతా అరియనను కిందికి దిగాలని సూచించారు. దానికి ఆమె ఇంతకు ముందు రెండుసార్లు దిగనని ఈ సారి దిగనని మొండికేసింది. మరోసారి మ్యూజిక్ ఆగిపోతే తప్పకకుండా దిగిపోతానని ఇప్పుడు మాత్రం దిగనని అంది. నువ్వు దిగాకపోతే ఎవరో ఒకరు దిగాల్సి వస్తుందని అభిజిత్ అన్నాడు. దానికి అరియనా ఏవేవో కారణాలు చెప్పుకుంటూ వచ్చింది. తనకు ఇంకొంత సేపు డ్యాన్స్ చేయాలనీ ఉందని అంటూ చెప్పింది.
ఇక ఇప్పట్లో అరియనా దిగేలా లేదని కండిషన్ మర్చిపోయి కిందకుర్చున్నాడు అభిజిత్. ఈ విషయాన్నీ పక్కనే ఉన్న మోనాల్ గుర్తుచేసింది. దాంతో ఈ విషయం తనకు తెలియలేదని, చేసుకోలేదని పొరపాటున జరిగిపోయిందని స్టేజ్ దిగేసాడు అభిజిత్. టాస్క్ ల సమయంలో చాలా జాగ్రత్త గా ఉండే అభిజిత్ ఇలా కండీషన్స్ మర్చిపోవడం ఏంటి అని ఇంటిసభ్యులంతా అవాక్ అయ్యారు. ఏంటి అభి.. ప్రతిసారి టాస్క్ పేపర్ క్షుణ్ణంగా చదువుతావు.. ఈ సారి ఏమైంది చూసుకోవాలి కదా.. అంటూ సోహెల్ సెటైర్లు వేసాడు. మొత్తానికి తెలివైనోడు మొదటిసారి కండీషన్స్ మర్చిపోయాడు.