Bigg Boss: కొత్త సినిమా ప్రకటించిన బిగ్‌బాస్ కంటెస్టెంట్… ఈ సినిమా వేరేగా ఉంటుందంటూ స్టేట్‌మెంట్…

| Edited By:

Dec 25, 2020 | 12:16 PM

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 4 సెకండ్ రన్నర్ సోహైల్ తన కొత్త సినిమాను ప్రకటించాడు. సోహైల్‌ మిత్రుడు శ్రీనివాస్‌ వింజనంపాటి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నాడు.

Bigg Boss: కొత్త సినిమా ప్రకటించిన బిగ్‌బాస్ కంటెస్టెంట్... ఈ సినిమా వేరేగా ఉంటుందంటూ స్టేట్‌మెంట్...
Follow us on

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 4 సెకండ్ రన్నర్ సోహైల్ తన కొత్త సినిమాను ప్రకటించాడు. సోహైల్‌ మిత్రుడు శ్రీనివాస్‌ వింజనంపాటి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నాడు. ‘జార్జ్‌ రెడ్డి’, ‘ప్రెషర్‌ కుక్కర్‌’ చిత్రాల నిర్మాత అప్పిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 

ఈ సందర్భంగా హీరో సోహైల్ మాట్లాడుతూ… బిగ్‌బాస్‌కు ముందు చాలా సినిమాల్లో నటించానని, అవేమీ గుర్తింపునివ్వలేదని అన్నారు. బిగ్‌ బాస్‌ తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడని చాలామంది అనుకుంటారని తెలిపారు. కానీ, నిజంగానే ఈ సినిమా వేరేగా ఉంటుందని అన్నారు. అన్ని వర్గాల మనసునూ గెలుచుకుంటాననే నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. సినిమా నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ… ఇండియాలో ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇంతవరకు సినిమా రాలేదని అన్నారు. సినిమా దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. నేను సోహైల్‌తో ఎన్నో కథలు పంచుకున్నానని, ఈ సినిమా ద్వారా మా కల నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది అన్నారు.