Bigg Boss 4: ‘నాతో ఎంటర్‌టైన్‌మెంట్ మాములుగా ఉందంటూ’ సమంతా బిగ్ బాస్ సీజన్ 4 దసరా మహా ఎపిసోడ్‌కు హోస్టుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగార్జున ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ నిమిత్తం మనాలీ వెళ్లడంతో ఆ బాధ్యతలను తన కోడలు సమంతాకు అప్పజెప్పారు. దీనితో దసరా మారథాన్ ఎపిసోడ్‌కు సమంతా హోస్ట్‌గా విచ్చేసింది.
అయితే ఆమె హోస్టింగ్ బాగోలేదని కొందరు పెదవి విరిచారు. సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ కూడా చేశారు. ఇక వారందరికీ షాక్ కలిగిస్తూ సమంతా హోస్ట్ చేసిన మారథాన్ ఎపిసోడ్‌కు 11.4 టీఆర్పీ రేటింగ్ దక్కడం విశేషం. దీంతో సామ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. కాగా, ఈ సీజన్ ఆరంభ ఎపిసోడ్‌కు 18.5 టీఆర్పీ రేటింగ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఇలాంటి పరిస్థితి కనిపించలేదు. అప్పుడప్పుడూ వీకెండ్ ఎపిసోడ్స్ తప్పితే మిగిలిన రోజుల్లో టీఆర్పీ దారుణంగా పడిపోయాయి. అలాంటి తరుణంలో సమంతా వచ్చి బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్స్‌కు కాస్త బూస్ట్ ఇచ్చారని చెప్పాలి.
Also Read: చైతూకు విడాకులు ఇవ్వమన్న నెటిజన్‌కు.. సామ్ క్రేజీ కౌంటర్!