బీజేపీకి షాక్… మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ రాజీనామా….

| Edited By: Pardhasaradhi Peri

Dec 20, 2020 | 12:36 PM

తెలంగాణ బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి ఎర్ర శేఖర్ రాజీనామా చేశారు.

బీజేపీకి షాక్... మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ రాజీనామా....
Follow us on

తెలంగాణ బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. గజ్వేల్ ఉప ఎన్నికల్లో గెలుపు… జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయ కేతనం ఎగరేసి మంచి ఊపు మీద ఉంది బీజేపీ. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇప్పటికే రాజకీయ దాడిని తీవ్రతరం చేశాడు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ సర్కారును సాగనంపుతామని, సీఎం కేసీఆర్‌ను జైలుకు పంపుతామని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సత్తాచాటుతామని అంటున్నారు.

 

పార్టీ బలోపేతంపై ద‌ృష్టి….

బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నకైన తర్వాత బీజేపీని తెలంగాణ రాష్రంలో బలోపేతం చేసే దిశగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. మొదటి నుంచి ఉన్న బీజేపీ క్యాడర్‌ను ఉత్తేజపరుస్తున్నాడు. అదే సమయంలో ఇతర పార్టీ అసంతృప్తి నేతలను బీజేపీలోకి తీసుకొస్తు్న్నారు. ఈ క్రమంలోనే శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్‌ను బీజేపీలోకి ఆహ్వానించారు. అంతేకాకుండా తెలంగాణ ఫైర్ బ్రాండ్ విజయ శాంతిని సైతం బీజేపీలో చేర్చుకున్నారు. మరికొందరు పేరున్న ప్రముఖులను బీజేపీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలను బండి సంజయ్ చేస్తున్నారు.రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.

బిగ్ షాక్…

బీజేపీని బలోపేతం చేయాలని చూస్తున్న బండి సంజయ్‌కి ఊహించని షాక్ తలిగింది. బండి ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే ఆ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి ఎర్ర శేఖర్ తాజాగా రాజీనామా చేశారు. నారాయణ పేట సభకు వెళ్తున్న బండి సంజయ్‌కి ఎర్ర శేఖర్ తన రాజీనామా లేఖను అందజేశారు. కాగా, అంతకు ముందే… జితేందర్ రెడ్డి నివాసంలో బండి సంజయ్ తో కలిసి ఎర్ర శేఖర్ టిఫిన్ చేశారు. అయితే తన రాజీనామాకు కారణం గ్రూప్ రాజకీయాలేనని ఆయన లేఖలో పేర్కొన్నారు. అయితే స్థానిక జిల్లా నేతల మధ్య సఖ్యత లేని కారణంగానే ఎర్ర శేఖర్ రాజీనామా చేసి ఉంటారని స్థానిక బీజేపీ నేతలు చెబుతున్నారు.