లాంగ్వేజ్‌తో పేచీ.. ఏపీ పాలిటిక్స్‌లో ‘ఇంగ్లీష్’ కహానీ!

|

Nov 11, 2019 | 9:47 PM

సర్కారీ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ ఎప్పుడైతే నిర్ణయించిందో.. అప్పటి నుంచి ఏపీ పాలిటిక్స్ హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అధికార పార్టీ, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.  నాయకులు, సెలబ్రిటీల పిల్లలకు ఒక న్యాయం.. పేద పిల్లలకు ఒక న్యాయమా అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇంగ్లీష్‌ను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు, వెంకయ్య నాయుడు మనవలు, మనవరాళ్లు.. పవన్ కళ్యాణ్ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో చెప్పాలంటూ […]

లాంగ్వేజ్‌తో పేచీ.. ఏపీ పాలిటిక్స్‌లో ఇంగ్లీష్ కహానీ!
Follow us on

సర్కారీ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ ఎప్పుడైతే నిర్ణయించిందో.. అప్పటి నుంచి ఏపీ పాలిటిక్స్ హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అధికార పార్టీ, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.  నాయకులు, సెలబ్రిటీల పిల్లలకు ఒక న్యాయం.. పేద పిల్లలకు ఒక న్యాయమా అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇంగ్లీష్‌ను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు, వెంకయ్య నాయుడు మనవలు, మనవరాళ్లు.. పవన్ కళ్యాణ్ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో చెప్పాలంటూ జగన్ నిలదీస్తున్నారు.

ఇక ఈ వ్యాఖ్యలకు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కౌంటర్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎవరి పిల్లలు ఏ స్కూల్‌లో చదువుతున్నారనేది ముఖ్యం కాదని.. పిల్లలపై భాషను బలవంతంగా రుద్దొద్దని సూచించారు. మాతృ భాష తెలుగును మరుగున పడనివ్వకుండా.. ఆప్షన్ విధానాన్ని ప్రవేశపెడితే బాగుంటుందన్నారు. అంతేకాకుండా ఇంగ్లీష్ మీడియం పేరుతో మతపరమైన కుట్ర జరుగుతుందేమోనని భయం కలుగుతోందన్నారు. ఇలా రెండు వర్గాల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఇక ఈ లాంగ్వేజ్ లడాయిపై టీవీ 9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ వేదికగా చర్చ జరిగింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..